ETV Bharat / international

నేపాల్ అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్ ప్రమాణం.. హాజరైన ఆ దేశ ప్రధాని - నేపాల్​ అధ్యక్ష ఎన్నికలు 2023

నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో నేపాల్​ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరి కృష్ణ కార్కి ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రామ్ చంద్ర పౌడెల్​ విజయం సాధించారు.

nepal president Ram Chandra Paudel
nepal president Ram Chandra Paudel
author img

By

Published : Mar 13, 2023, 5:05 PM IST

Updated : Mar 13, 2023, 5:49 PM IST

నేపాల్ కొత్త అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ నేత రామ్ చంద్ర పౌడెల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష భవనం శీతల్​ నివాస్​లో జరిగిన వేడుకలో నేపాల్​ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరి కృష్ణ కార్కి.. రామ్ చంద్ర పౌడెల్​ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు ప్రధాని పుష్ప కమల్​ దహల్, స్పీకర్​ దేవ్​ రాజ్​ గిమిరే, జాతీయ అసెంబ్లీ ఛైర్మన్ గణేశ్​ ప్రసాద్​ తిమిల్​సిన తదితరులు హాజరయ్యారు.

ఇటీవల నేపాల్​లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రామ్ చంద్ర పౌడెల్ విజయం సాధించారు. ప్రధాని ప్రచండ నేతృత్వంలోని 8 పార్టీల కూటమి రామ్‌ చంద్ర పౌడెల్‌కు మద్దతు పలికింది. రామ్​ చంద్ర గతంలో స్పీకర్​, పలుమార్లు మంత్రిగా పనిచేశారు. ఇక ఆరు సార్లు చట్టసభ సభ్యుడిగా కూడా ఆయన పని చేశారు. అంతేకాకుండా ఓ దశాబ్దం పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. 2008లో నేపాల్​ గణతంత్ర దేశంగా మారాక.. మూడు సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. నేపాల్ 3వ అధ్యక్షుడిగా రామ్​ చంద్ర పౌడెల్ బాధ్యతలు స్వీకరించారు. 1944 అక్టోబరు 14న రైతు కుటుంబంలో జన్మించారు రామ్ చంద్ర పౌడెల్​. 16 సంవత్సరాల వయసులోనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు.

కాగా, నేపాల్​ కొత్త ప్రధాన మంత్రిగా పుష్ప కమల్ దహాల్ 'ప్రచండ'.. గతేడాది డిసెంబరు 26వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. నాటకీయ పరిణామాల మధ్య కొత్త కూటమిని ఏర్పాటు చేసిన కమల్​ ప్రచండ.. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని పదవిని పంచుకునే విషయంలో ఏర్పడ్డ అభిప్రాయభేదాల కారణంగా పాత కూటమికి గుడ్​బై చెప్పారు ప్రచండ. దీంతో ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు పార్టీల అధికార కూటమి.. ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. ప్రధాని పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలనే అంగికారానికి ఎన్నికలకు ముందు మాజీ ప్రధాని దేవ్​బా, ప్రచండ వచ్చారు.

అయితే, మొదటి రెండున్నరేళ్లు ప్రధాని పదవి తనకు అప్పగించాలని ప్రచండ చేసిన ప్రతిపాదనను దేవ్​బా తిరస్కరించడం వల్ల.. ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో కూటమి విచ్ఛిన్నమైంది. ఫలితంగా విపక్షంలో ఉన్న తన పాత మిత్రుడు, మాజీ ప్రధాని ఓలిని సంప్రదించి.. మద్దతు కోరారు ప్రచండ. ఇందుకు ఓలి సుముఖంగా స్పందించగా.. 169 మంది చట్టసభ్యుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రచండ ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రచండను ప్రధానిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Last Updated : Mar 13, 2023, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.