Mexico Aliens Display : మెక్సికో పార్లమెంట్లో ప్రదర్శించిన వేల ఏళ్ల నాటి ఏలియన్ల అవశేషాలు పూర్తిగా అవాస్తవమని తేల్చారు మెక్సికోలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ పరిశోధకురాలు జూలియాటా ఫియరో. మానవులా? కాదా? అన్న విషయాన్ని నిర్ధరించడానికి ఎక్స్ కిరణాల కంటే అధునాతనమైన సాంకేతికత అవసరమని తెలిపారు. మౌసాన్.. గ్రహాంతరవాసులతో మాట్లాడినట్లు కూడా చెబుతారని.. తాను వాటిని నమ్మనని తెలిపారు. ఆ అవశేషాలను పెరూ నుంచి సేకరించగా.. కనీసం ఆ దేశ రాయబారిని ఆహ్వానించకపోవడం వింతగా ఉందన్నారు.
Aliens Mexican Congress : అంతకుముందు మంగళవారం చట్టసభలో ఏలియన్ అవశేషాలను ప్రదర్శించారు జర్నలిస్ట్, యూఫోలజిస్ట్ జైమ్ మౌసాన్. రెండు చెక్క పెట్టెల్లో ఉన్న ఏలియన్స్ అవశేషాలను మెక్సికో పార్లమెంట్లో తెరిచి చూపించారు. వంకర తలతో, కుచించుకోపోయిన శరీరంతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రెండు గ్రహాంతర జీవుల శిలాజ అవశేషాలను వేల ఏళ్ల కిందట పెరూలోని కుస్కో నుంచి వెలికితీసినట్టు మౌసాన్ చెప్పారు. ఇవి మన భూగోళానికి చెందినవి కావని.. అలాగే గుర్తు తెలియని ఎగిరే వస్తువు (UFO) శిథిలాల నుంచి కనుగొన్న జీవులు కూడా కాదని స్పష్టం చేశారు. డయాటమ్ (ఆల్గే) గునుల్లో బయటపడిన శిలాజ అవశేషాలని తెలిపారు.
-
United States: "We allegedly recovered non-human biologics."
— KanekoaTheGreat (@KanekoaTheGreat) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Mexico: "Watch us unbox two mummified aliens."
👽👽 pic.twitter.com/bNK14cwpmI
">United States: "We allegedly recovered non-human biologics."
— KanekoaTheGreat (@KanekoaTheGreat) September 13, 2023
Mexico: "Watch us unbox two mummified aliens."
👽👽 pic.twitter.com/bNK14cwpmIUnited States: "We allegedly recovered non-human biologics."
— KanekoaTheGreat (@KanekoaTheGreat) September 13, 2023
Mexico: "Watch us unbox two mummified aliens."
👽👽 pic.twitter.com/bNK14cwpmI
Aliens Mexican Parliament Display 2023 : మరోవైపు ఈ రెండు ఏలియన్స్ మృతదేహాలకు డీఎన్‌ఏ నమూనాలు పరీక్షించినట్లు మెక్సికో కాంగ్రెస్‌కు మౌసాన్ వివరించారు. ఇతర డీఎన్‌ఏ నమూనాలతో వీటిని పోల్చినట్లు చెప్పారు. అయితే వీటి డీఎన్‌ఏలో ఏమున్నది అన్నది 30 శాతానికిపైగా తెలియలేదన్నారు. ఎక్స్‌రే కూడా తీయగా అరుదైన లోహాలతోపాటు ఒక ఏలియన్ అవశేషాల్లో గుడ్లు వంటి వాటిని కనుగొన్నట్లు మౌసాన్ వెల్లడించారు. ఈ జీవులు మానవ పరిణామంతో సంబంధం లేదని చెప్పారు. డీఎన్‌ఏ పరీక్షల్లో ఇలాంటి జీవులు ప్రపంచంలోనే లేవని చూపిస్తున్నప్పుడు మనం వాటిని అలాగే తీసుకోవాలన్నారు. అంతకుముందు 2017లోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు మౌసాన్.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి ఏలియన్లవే అంటూ పేర్కొనడాన్ని అనేక మంది శాస్త్రవేత్తలు ఖండిస్తున్నారు. మానవుల శరీరభాగాలకు మార్పులు చేసి ఇలా తయారు చేశారని కొందరు వాదిస్తున్నారు. ట్విట్టర్ సైతం ఇందుకు సంబంధించిన వీడియోలను ఫ్లాగ్ చేసింది. ఇవి ఏలియన్లవి కాదదని పలువురు శాస్త్రవేత్తల అభిప్రాయాలతో కూడిన లింక్స్‌ను కమ్యూనిటీ నోట్స్ షేర్ చేస్తోంది.
ఏలియన్స్‌పై అమెరికా ఉన్నతాధికారి సంచలన వ్యాఖ్యలు
UFO Aliens : అంతకుముందు జులైలో.. ఏలియన్లు ఉంటాయనే ప్రచారం జరిగే ఫ్లయింగ్ సాసర్లు యూఎఫ్ఓలపై తమ దేశం కొన్ని విషయాలను దాచిపెడుతోందని అమెరికా మాజీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రుష్ బాంబు పేల్చారు. అమెరికా పార్లమెంటు కాంగ్రెస్‌కు వాంగ్మూలం ఇచ్చిన ఆయన కొన్ని ఆధారాలను సమర్పించారు. అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్- యూఎఫ్ఓలను ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనోమినన్- యూఏపీలుగా అమెరికాలో పిలుస్తారు. టాస్క్‌ఫోస్క్ మిషన్‌కు సంబంధించిన అత్యంత క్లాసిఫైడ్ ప్రోగ్రామ్‌లను గుర్తించమని యూఏపీలపై ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ అధిపతి తనను 2019లో అడిగారని గ్రుష్ చెప్పారు. ఆ సమయంలో యూఎస్ గూఢచారి ఉపగ్రహాలను నిర్వహించే నేషనల్ రికనైసెన్స్ ఆఫీస్‌కు ఈ విషయాన్ని వివరించినట్లు ఆయన చెప్పారు. యూఏపీ క్రాష్ రిట్రీవల్, రివర్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌కు తనకు అనుమతి రాలేదన్నారు.
'భూమిపై ఏలియన్లు.. అప్పుడప్పుడు వచ్చిపోయే సాసర్లు'.. అమెరికా ఏమందంటే?
మార్స్ నుంచి ఏలియన్స్ సందేశం! డీకోడ్ చేయలేక సైంటిస్టుల ఇబ్బందులు.. హెల్ప్ చేస్తారా?