Kim Jong Un Rifle : ఉత్తర కొరియా ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే.. ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఉన్ మాత్రం క్షిపణి పరీక్షలు, సైనిక సమీక్షలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. దేశంలోని ఆయుధ ఫ్యాక్టరీలు, క్షిపణి ఇంజిన్ల తయారీ కేంద్రాల్లో పర్యటించారు. రైఫిళ్ల పనితీరును కిమ్ స్వయంగా పరిశీలించిన ఫొటోలను.. ఉత్తర కొరియా అధికార మీడియా- KCNA విడుదల చేసింది. దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఆయుధ శక్తిని మరింత పెంచాలని సైనిక బలగాలకు సూచించినట్లు తెలిపింది.
ఏకధాటిగా మూడురోజుల పాటు..
Kim Jong Un Weapons Factory : అగ్రరాజ్యం అమెరికా, దాయాది దక్షిణ కొరియాతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న సమయంలో ఆయుధ ఫ్యాక్టరీల్లో ప్యాంగ్‌యాంగ్ నియంత కిమ్ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి ఇంజిన్ల తయారీ కేంద్రంతోపాటు ఇతర ఆయుధ ఫ్యాక్టరీలు, మానవరహిత గగనతల వాహనాలు, భారీ రాకెట్ లాంచర్లకు అవసరమైన పనిముట్ల తయారీ కేంద్రాలను ఏకధాటిగా మూడురోజులు సందర్శించినట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆధునాతన తుపాకులు సహా పలు ఆయుధాలను కిమ్ స్వయంగా పరిశీలించారు.
బాలిస్టిక్ క్షిపణిని పరిశీలించిన కిమ్
Kim Jong Un Nuclear Weapon : తమ శైలికి అనుగుణంగా వ్యూహాత్మక ఆయుధాలను అభివృద్ధి చేయాలని ఇందుకోసం అత్యాధునిక సాంకేతికత కలిగిన ఇంజిన్లను రూపొందించాలని కిమ్ నిపుణులకు సూచించినట్లు కేసీఎన్ఏ తెలిపింది. భారీ దాడులకు ఉపయోగించే రాకెట్లను, అత్యాధునిక క్రూయిజ్ క్షిపణులతోపాటు ఇటీవల కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని కిమ్ పరిశీలించారు.
కొరియాలోకి అమెరికా 'అణు' సబ్‌మెరైన్
North Korea Missile Launch : గతనెలలో కిమ్ జోంగ్ ఉన్ నాయకత్వంలోని ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేసింది. అమెరికాకు హెచ్చరికగా రెండు స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన సబ్‌మెరైన్‌ను దక్షిణ కొరియాకు అమెరికా తరలించిన నేపథ్యంలో హెచ్చరికగా కిమ్ ఈ క్షిపణి ప్రయోగాలు చేసినట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్కు సమీపంలోని ఓ ప్రాంతం నుంచి ఈ క్షిపణులు దూసుకొచ్చాయని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కార్యాలయం తెలిపింది. మిసైళ్లు 550 కిలోమీటర్లు ప్రయాణించి కొరియా ద్వీపకల్పానికి తూర్పున సముద్ర జలాల్లో పడిపోయాయని వెల్లడించింది. ఈ పూర్తి వార్త కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
కిమ్ రాజ్యంలో ఆకలి చావులు.. పక్క రాష్ట్రం నుంచి ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటే కాల్పులు!
కిమ్ ఆరోగ్య సమస్యలు తీవ్రం.. చికిత్స కోసం విదేశీ ఔషధాలు.. 'AI' ఏం చెప్పిందంటే?