ETV Bharat / international

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దాడిలో 10 మంది మృతి.. ఉక్రెయిన్​లో మరో 11 మంది.. - 11 people were Ukrainians in the Russian attack

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడి జరిపింది. ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని పాలస్తీనా అధికారులు తెలిపారు. ఉక్రెయిన్​పై రష్యా చేసిన దాడిలో మరో 11 మంది మరణించారు.

Israeli forces killed Palestinians several died
పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దాడి
author img

By

Published : Jan 27, 2023, 6:23 AM IST

Updated : Jan 27, 2023, 7:03 AM IST

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. రెండు దశాబ్దాల్లో జరిగిన అత్యంత ఘోరమైన ఈ ఘటనపై పాలస్తీనాలో తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్​తో భద్రతా సంబంధాలను తగ్గించుకోవాలని పాలస్తీనా నాయకులపై ఒత్తిడి పెరుగుతోంది. మరో ఘటనలో 22 ఏళ్ల పాలస్తీనియుడిపై ఇజ్రాయెల్‌ దళాలు కాల్పులు జరపగా.. అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ వచ్చే వారం ఈ ప్రాంతంలో చేపట్టనున్న పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి.

పాలస్తీనాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇజ్రాయెల్ దళాలు టియర్ గ్యాస్​ను పేల్చాయన్నారు. దీంతో ఆస్పత్రిలోని పిల్లలు ఊపిరాడక ఇబ్బంది పడ్డారని ఓ అధికారి తెలిపారు. ఈ ఘటనపై పాలస్తీనా అథారిటీ ప్రధాన మంత్రి ముహమ్మద్ ష్టయేహ్ స్పదించారు. తమ దేశంలోని పిల్లలు, యువత, మహిళలకు రక్షణ కల్పించేందుకు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలను కోరారు.

రష్యా దాడిలో 11 మంది ఉక్రెయిన్​లు
ఉక్రెయిన్‌కు అత్యాధునిక యుద్ధ ట్యాంకులు సరఫరా చేయాలని అమెరికా, జర్మనీ నిర్ణయించిన వేళ ఆ దేశంపై రష్యా మరోసారి భీకర దాడులకు దిగింది. రాజధాని కీవ్‌ తోపాటు ఒడెస్సా ప్రాంతాలపై పదుల కొద్ది క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది. ఆయా చోట్ల మొత్తం 11 మంది మృతిచెందినట్లు ఉక్రెయిన్‌ అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. దాడుల కారణంగా.. ఒడెస్సాలో రెండు విద్యుత్‌ కేంద్రాలు ధ్వంసం కాగా, ముందు జాగ్రత్తగా కీవ్‌తో పాటు ఒడెస్సా, వినిత్సియా ప్రాంతాల్లో విద్యుత్ కోతలు విధించారు. మార్చి నెలాఖరు, లేదా ఏప్రిల్‌ ప్రారంభం నాటికి ఉక్రెయిన్‌కు లెపర్డ్‌-2 యుద్ధ ట్యాంకులు చేరవేస్తామని జర్మనీ రక్షణశాఖ మంత్రి బోరిస్ పిస్టోరియస్ తెలిపారు.

Last Updated : Jan 27, 2023, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.