ETV Bharat / international

అమెరికాలో భారత సంతతి కుటుంబంలోని ముగ్గురు మృతి- అదే కారణమా? - అమెరికాలో ముగ్గురు మృతి

Indo Americans Family Died In US : భారత సంతతికి చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు అగ్రరాజ్యం అమెరికాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Indo Americans Family Suicide In US 3 Died In Same Family
Indo Americans Family Suicide In US
author img

By PTI

Published : Dec 30, 2023, 2:28 PM IST

Updated : Dec 30, 2023, 3:33 PM IST

Indo Americans Family Died In US : అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మసాచుసెట్స్‌ రాష్ట్రంలోని విలాసవంతమైన ఓ భవనంలో వారి మృతదేహాలను గురువారం రాత్రి గుర్తించారు పోలీసులు. మృతులు రాకేశ్‌ కమల్‌(57), ఆయన భార్య టీనా(54), కుమార్తె అరియానా(18) గుర్తించారు.

రెండురోజుల నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం కారణంగా వారి బంధువు పోలీసులకు సమాచారం ఇవ్వటం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాకేశ్‌ కమల్ మృతదేహం వద్ద తుపాకీ ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. గృహహింసా లేక ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బయటి వ్యక్తుల ప్రమేయంపైనా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఉన్నత విద్యావంతులు
2016లో ఎడ్యునోవా పేరిట విద్యారంగానికి చెందిన ఓ సంస్థను ప్రారంభించారు రాకేశ్‌ కమల్‌ దంపతులు. దాని కార్యకలాపాలు 2021లో నిలిచిపోయాయి. సంస్థ వెబ్‌సైట్‌ ప్రకారం బోస్టన్‌ విశ్వవిద్యాలయం, ఎంఐటీ సోలన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయాల నుంచి రాకేశ్‌ పట్టాలు పొందారు. ఈయనకు విద్యారంగంలో అపారమైన అనుభవం ఉంది. టీనా హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థి. ఈమెకు రెడ్‌క్రాస్‌ ఛారిటీ బోర్డులో పనిచేసిన అనుభవం ఉంది.

కాస్ట్లీ బంగ్లా
రాకేశ్‌ కమల్‌ దంపతులు నివసించే విల్లా విలువ 5 మిలియన్‌ డాలర్లుగా ఉంటుందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 11 పడక గదులతో 19వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న ఆ బంగ్లాను రాకేశ్​ కమల్​ 2019లోనే కొనుగోలు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ ఇంట్లో రాకేశ్​​ తన భార్య టీనా, కుమార్తె అరియానాతో కలిసి ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారికి చెందిన కొన్ని ఆస్తులు జప్తు అయినట్లు సదరు వార్తాకథనాలు తెలిపాయి. గతంలో ఈ కుటుంబం దివాలా పిటిషన్‌ వేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఒకే కుటుంబంలోని 10 మంది
Congo Flood Death Accident : కాంగోలోని సెంట్రల్ ప్రావిన్స్​లో సంభవించిన భారీ వరదల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు మరో 12 మంది చనిపోయారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల కనంగా జిల్లాలోని అనేక ఇళ్లు, భవన నిర్మాణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఈ వార్త పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

చైనా నిఘా బెలూన్- అమెరికా ఇంటర్నెట్‌నే వాడి!

122 క్షిపణులు, 36 డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా- ఉక్రెయిన్​తో యుద్ధంలో అతిపెద్ద దాడి ఇదే!

Last Updated : Dec 30, 2023, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.