Indian Family Dead In London : దీపావళి వేడుకలు చేసుకుంటుండగా అగ్నిప్రమాదం సంభవించి భారత సంతతికి చెందిన ఐదుగురు కుటుంబసభ్యులు మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండగా.. ప్రమాదంలో మరో వ్యక్తి గాయపడ్డారు. ఈ ఘటన బ్రిటన్ రాజధాని లండన్‌లో ఆదివారం రాత్రి జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మృతుల పేర్లను ఇంకా వెల్లడించలేదు. ఈ ప్రమాదంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మెట్రోపాలిటన్ చీఫ్ పోలీస్ సీన్ విల్సన్.. ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్తగా పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించామని చెప్పారు.
"ఆదివారం రాత్రి హౌన్స్లో ప్రాంతంలోని ఛానెల్ క్లోజ్ నుంచి మాకు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సహాయక బృందాలు వెళ్లే సరికి ఐదుగురు మరణించగా.. మరొకరు గాయపడ్డారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతడి ప్రాణానికి ఎలాంటి అపాయం లేదు. వీరందరిని ఒకే కుటుంబానికి చెందిన వారిగా భావిస్తున్నాం."
--సీన్ విల్సన్, మెట్రోపాలిటన్ పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్
అయితే, మాంచెస్టర్‌కు చెందిన భారత సంతతి వ్యక్తి దిలీప్ సింగ్ మాట్లాడుతూ.. ఆ భవనంలో తన బావ ఉన్నారని చెప్పారు. తనకు సమాచారం అందిన వెంటనే ఇక్కడకు వచ్చామని తెలిపారు. ఒక డబ్బా నుంచి మంటలు చెలరేగాయని చెబుతున్నారని.. అసలేం జరిగిందో తనకు తెలియదన్నారు. బాధిత కుటుంబం ఇటీవలే బెల్జియం నుంచి లండన్‌లోని ఇంటికి మారినట్లు సమాచారం.
దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు భారతీయులు సహా 16 మంది మృతి
Dubai building fire accident : దుబాయ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు భారతీయులు సహా మొత్తం 16 మంది మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు. అల్ రస్ ప్రాంతంలో శనివారం జరిగిందీ దుర్ఘటన. మృతుల్లో కేరళకు చెందిన ఇద్దరు ఉన్నారు. వీరు భార్యాభర్తలు. తమిళనాడుకు చెందిన మరో ఇద్దరు పురుషులు కూడా అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరు ఆ భవనంలో పని చేస్తున్నట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి