ETV Bharat / international

'రష్యా-ఉక్రెయిన్​ మధ్య త్వరలోనే ఒప్పందం' - రష్యా ఉక్రెయిన్​ యుద్ధంపై భారత్​

India in Russia Ukraine Talks: రష్యా, ఉక్రెయిన్​ మధ్య జరుగుతున్న శాంతి చర్చలపై భారత్ స్పందించింది. ఇరు దేశాలు తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఓ ఒప్పందానికి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది. యుద్ధం వల్ల ఇప్పటికే చాలా నష్టం జరిగిందని, వీలైనంత త్వరగా దీనికి ముగింపు పలకాలని పేర్కొంది.

India calls for 'purposeful engagement' by Russia
'రష్యా-ఉక్రెయిన్​ మధ్య త్వరలోనే ఒప్పందం'
author img

By

Published : Mar 30, 2022, 12:51 PM IST

India on Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు సత్ఫలితాన్ని ఇస్తాయని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. రెండు దేశాలు తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఓ ఒప్పందానికి రావాలని సూచించింది. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గించి యుద్ధానికి ముగింపు పలకాలని చెప్పింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్​లో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి ఐరాస భద్రతా మండలి సమావేశంపై మంగళవారం మాట్లాడారు. ఉక్రెయిన్​లో పరిస్థితిపై చర్చ గురించి ప్రస్తావిస్తూ ఈ మేరకు తెలిపారు. ఉక్రెయిన్​కు భారత్​ మానవతా సాయం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Russia Ukraine talks: రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చల్లో పురోగతి ఉంటుందని భావిస్తున్నట్లు తిరుమూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలోనే రెండు దేశాల మధ్య ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్​లో ఉద్రిక్తతలు తగ్గించి శాంతి, సుస్థిరత నెలకొల్పేనేందుకు ప్రయత్నించడమే తమ ఐక్య కార్యాచరణ అని వివరించారు. యుద్ధం కారణంగా ఇరు దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వస్తువుల ధరలు కూడా పెరగడం ఇందుకు నిదర్శనం అన్నారు. రష్యా, ఉక్రెయిన్​ మధ్య మంగళవారం టర్కీ వేదికగా శాంతి చర్చలు జరిగాయి. ఇందులో కీలకు ముందడుగు పడింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.

ఇదీ చదవండి: ఉక్రెయిన్‌, రష్యా చర్చల్లో కీలక ముందడుగు.. త్వరలో పుతిన్- జెలెన్​స్కీ భేటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.