ETV Bharat / international

'జైలులోనే ఇమ్రాన్ హత్యకు కుట్ర.. గుండెపోటు వచ్చేలా ఇంజెక్షన్లు ఇచ్చి చిత్రహింసలు!' - imran khan niazi

Imran Khan News : మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుతో పొరుగుదేశం పాకిస్థాన్‌ అట్టుడుకింది. ఇమ్రాన్‌ అరెస్టు అక్రమమని పాక్‌ సుప్రీంకోర్టు గురువారం తేల్చి.. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ పరిణామాల మధ్య ఇమ్రాన్ తరఫు న్యాయవాదులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను జైల్లోనే హత్య చేసేందుకు కుట్రలు జరిగాయని ఆరోపించారు.

imran khan
imran khan
author img

By

Published : May 12, 2023, 2:10 PM IST

Updated : May 12, 2023, 2:41 PM IST

Imran Khan Arrest : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తరఫు న్యాయవాదులు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఇమ్రాన్‌తో ఓ గంటపాటు న్యాయవాదులు భేటీ అయ్యారు. తనను జైల్లో నిద్ర పోనివ్వలేదని టాయిలెట్‌, బెడ్‌లేని ఒక గదిలో ఉంచారని ఇమ్రాన్ ఈ సందర్భంగా తమకు తెలిపినట్లు ఆయన తరఫు న్యాయవాదులు చెప్పారు. వాష్‌రూమ్‌ వాడుకోవడానికి కూడా అనుమతించడం లేదని చిత్రహింసలు పెట్టి నెమ్మదిగా గుండెపోటును ప్రేరేపించే ఆహారం, ఇంజెక్షన్లు ఇచ్చారని ఇమ్రాన్ వాపోయారని న్యాయవాదులు అన్నారు. అరెస్టు అనంతరం ఇస్లామాబాద్‌లోని పోలీస్‌ లైన్స్‌కు తీసుకువెళ్లిన తర్వాత ఆహారం కూడా ఇవ్వలేదని ఇమ్రాన్‌ న్యాయవాదులు ఆరోపించారు.

ఇస్లామాబాద్​ హైకోర్టుకు ​ఇమ్రాన్
ముందస్తు బెయిల్ కోసం ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టు ఎదుట హాజరయ్యారు. భారీ భద్రత మధ్య ఇమ్రాన్ ఖాన్‌ను పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. ఇమ్రాన్ మద్ధతుదారులు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకోవడం వల్ల అదనపు బలగాలను మోహరించారు. జస్టిస్ మియాంగుల్ హసన్ ఔరంగజేబ్, జస్టిస్ సమన్ రఫత్ ఇంతియాజ్‌లతో కూడిన ప్రత్యేక డివిజన్ బెంచ్.. ఇమ్రాన్​ బెయిల్ పిటిషన్‌ను స్వీకరించింది. అయితే​ బెయిల్​ పిటిషనపై విచారణను ప్రారంభించిన స్పెషల్​ బెంచ్​.. శుక్రవారం కొద్దిసేపు వాయిదా వేసింది. ప్రతి శుక్రవారం చేసే ప్రత్యేక ప్రార్థనల అనంతరం విచారణను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించింది.

అల్ ఖదీర్ ట్రస్ట్‌కు అక్రమంగా భూములను కేటాయించి 5 వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో మంగళవారం ఇమ్రాన్ ఖాన్‌ను పారామిలిటరీ రేంజర్లు అరెస్టు చేశారు. అనంతరం పాకిస్థాన్‌లో అల్లర్లు చెలరేగడం వల్ల పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఇమ్రాన్‌ ఖాన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై పాక్‌ చీఫ్‌ జస్టిస్‌ ఉమర్‌ అతా బందియాల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.

ఇస్లామాబాద్‌ హైకోర్టు ప్రాంగణం నుంచి ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేయడంపై NABపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఇమ్రాన్​ భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలని ఇస్లామాబాద్ పోలీసులను సుప్రీం ఆదేశించింది. అయితే శుక్రవారం.. మాజీ ఫెడరల్ మంత్రి షిరీన్ మజారీతో సహా పీటీఐ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేతలందరినీ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ కింద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

imran khan
నిరసన తెలుపుతున్న ఇమ్రాన్​ ఖాన్​ అభిమానులు

Last Updated : May 12, 2023, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.