ETV Bharat / international

హౌతీలకు అమెరికా షాక్- 10మంది తిరుగుబాటుదారులు మృతి- భారత్ హైఅలర్ట్! - హౌతీలు దాడులు

Houthis Red Sea America : ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతీ తిరుగుబాటుదారులకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. హెలికాప్టర్లతో కాల్పులు జరిపి 10మంది హౌతీలను హతమార్చింది. మూడు బోట్లు ధ్వంసం చేసింది. మరోవైపు, అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళం అప్రమత్తమైంది.

Etv houthis red sea america
houthis red sea america
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 7:32 AM IST

Houthis Red Sea America : ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై నవంబరు నుంచి వరుస దాడులకు తెగబడుతున్న హౌతీ తిరుగుబాటుదారులకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా హెలికాప్టర్ల దాడితో 10 మంది హౌతీలు మృతి చెందారు. డెన్మార్క్ షిప్పింగ్ సంస్థ మెర్చ్ హంగ్జౌ రవాణా నౌకను ఆదివారం హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం నాలుగు బోట్లలో నౌక సమీపానికి చేరుకున్నారు.

మూడు బోట్లు ధ్వంసం- నాలుగోది జంప్!
ఈ సమయంలో మెర్స్ సిబ్బంది పంపిన సందేశాలతో రంగంలోకి దిగిన అగ్రరాజ్యానికి చెందిన హెలికాప్టర్లు కాల్పులు జరిపాయి. మూడు బోట్లు ధ్వంసం అవ్వగా నాలుగో బోటు తప్పించుకొని వెళ్లిపోయింది. కాల్పుల్లో 10 మంది మరణించినట్లు హౌతీలు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత 48 గంటల పాటు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు మెర్స్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

క్షిపణులను తిప్పికొట్టాం : అమెరికా
ఈ విషయంపై అమెరికా స్పందించింది. శనివారం కూడా మెర్స్ రవాణా నౌకపై హౌతీలు క్షిపణులను ప్రయోగించారని వాటిని తాము తిప్పికొట్టినట్లు తెలిపింది. ఆదివారం మరోసారి చిన్న బోట్లతో దాడికి ప్రయత్నించారని పేర్కొంది. మరోవైపు, అమెరికా దాడిపై హౌతీ తీవ్రంగా స్పందించింది. ఎర్ర సముద్రంలో అమెరికా సహా ఏ దేశం జోక్యం చేసుకున్నా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

అప్రమత్తమైన భారత్‌
అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళం అప్రమత్తమైంది. నిఘాను మరింత పెంచింది. యుద్ధనౌకలను, ఇతర వ్యవస్థలను మోహరిస్తున్నట్లు పేర్కొంది. "ఎర్ర సముద్రం, ఏడెన్‌ సింధుశాఖ, మధ్య/ఉత్తర అరేబియా సముద్రంలో గత కొన్ని వారాలుగా వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. ఎంవీ రూయెన్‌, ఎంవీ కెమ్‌ ప్లూటోలపై జరిగిన దాడులు భారత్‌ ఈఈజీ (ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌) సమీపానికి చేరినట్లు కనిపిస్తున్నాయి. ఇటువంటి దాడులను దీటుగా తిప్పికొట్టేందుకు గాను సముద్ర నిఘాను గణనీయంగా పెంచాం" అని భారత నౌకాదళం పేర్కొంది.

ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్‌కు మద్దతుగా యెమెన్‌లోని హౌతీ రెబల్స్ ఇజ్రాయిల్‌కు సంబంధం ఉన్న నౌకలపై దాడులకు తెగబడుతున్నారు. దీంతో పాటు ఎర్ర సముద్రం నుంచి వచ్చీపోయే నౌకలపై డ్రోన్లతో దాడి చేస్తున్నారు. ఈ దాడుల వల్ల ప్రపంచ వాణిజ్యంలో 12 శాతంపై ప్రభావం పడుతున్నట్లు సమాచారం. హౌతీలు జరుపుతున్న ఈ దాడులకు ఇరాన్ మద్దతు ఉందని అమెరికా ఆరోపిస్తోంది.

ఉక్రెయిన్ రివెంజ్​- రష్యన్ సిటీపై భీకరదాడి- 14మంది మృతి, 108మందికి గాయాలు

అమెరికాను వణికిస్తున్న రాకాసి అలలు- 10 మందిని లోపలికి ఈడ్చుకెళ్లిన సముద్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.