Porn in airport screens: రియో డి జెనీరియోలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు హ్యాకింగ్‌కు గురైనట్లు ఫెడరల్ పోలీసులకు శుక్రవారం సమాచారం అందించింది బ్రెజిల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఇన్ఫ్రాఏరో. ప్రకటనలు, విమానాల సమాచారానికి బదులు ప్రయాణికులకు వాటిల్లో పోర్న్ వీడియోలు చూపించినట్లు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వాటిని చూసి కొందరు ప్రయాణికులు ఆశ్చర్యానికి గురికాగా, మరికొందరు నవ్వుతూ కనిపించారు. కొందరు ప్రయాణికులు తమ చిన్నారులను వాటిని చూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
సమాచార సేవలను ఔట్సోర్సింగ్ ద్వారా మరో కంపెనీ నుంచి పొందుతున్నట్లు ఇన్ఫ్రాఏరో తన ప్రకటనలో తెలిపింది. ఆ సంస్థకు కూడా ఈ మేరకు సమాచారం అందించినట్లు వెల్లడించింది. "మా మీడియా తెరలపై ప్రసారమైన కంటెంట్‌కు ప్రకటన హక్కులను కలిగి ఉన్న సంస్థలదే బాధ్యత" అని ఇన్ఫ్రాఏరో పేర్కొంది. తమ పార్ట్నర్లు వారి సొంత ప్రసార వ్యవస్థలను వినియోగిస్తారని, దానికి ఇన్ఫ్రాఏరో ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌కు సంబంధంలేదని స్పష్టంచేసింది. హ్యాకింగ్‌కు గురైన స్క్రీన్లను ఆఫ్ చేసినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: శునకంలా మారిపోయిన జపాన్ వాసి.. లక్షలు ఖర్చు చేసి...