ETV Bharat / international

విమానం క్రాష్​లో గోల్డ్స్​ జిమ్​ యజమాని దుర్మరణం - అమెరికా కోస్టారికా

అమెరికా కోస్టారికా ప్రాంతాంలోని కరేబియన్​ సముద్రంలో ఓ చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. గోల్డ్స్​ జిమ్ ఓనర్​​, మెక్​ఫిట్​ వ్యవస్థాపకులు రైనర్​ షాలర్​ కూడా మృతుల్లో ఒకరు.

plane crash in costa rica
plane crash in costa rica america
author img

By

Published : Oct 23, 2022, 11:41 AM IST

అమెరికా కోస్టారికా ప్రాంతాంలోని కరేబియన్​ సముద్రంలో ఓ చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలగా.. ప్రఖ్యాత గోల్డ్స్​ జిమ్​ అధిపతి సహా మొత్తం ఆరుగురు మరణించారు. మృతుల్లో గోల్డ్స్​ జిమ్ ఓనర్​, మెక్​ఫిట్​ వ్యవస్థాపకులు రైనర్​ షాలర్​​తో పాటు మరో నలుగురు జర్మనీయులు, అలాగే స్విట్జర్లాండ్​కు చెందిన ఓ పైలట్​ ఉన్నారు.

మెక్సికో నుంచి శుక్రవారం బయలుదేరిన విమానం కరేబియన్​ తీరంలోని లిమోన్​ వద్దకు చేరుకునే సమయంలో రాడార్​ నుంచి అదృశ్యమయ్యింది. విమానం కనిపించకుండా పోయిన తర్వాత గాలింపు చర్యలు ప్రారంభించిన అధికారులకు మరుసటి రోజు నీటిలో దాని శకలాలు కనుగొన్నారు. గల్లంతైన వ్యక్తుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కానీ వాతావరణ మార్పుల కారణంగా ఆ పనిని తాత్కాలికంగా నిలిపేశామని అధికారులు తెలిపారు.

plane crash in costa rica
అధికారులకు దొరికిన వస్తువులు

గోల్డ్స్​ జిమ్​ భారత్​లోనూ కార్యకలాపాలు సాగిస్తోంది. ఆ సంస్థ యజమాని అయిన రైనర్.. 2010 బెర్లిన్​ లవ్​ పరేడ్​ టెక్నో ఫెస్టివల్​లో తొక్కిసలాట జరిగి 21 మంది మృతిచెందగా.. అనేక ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈవెంట్​ జరిగే మైదానంలోకి ప్రవేశించేందుకు భారీగా గుమిగూడిన ప్రజలను కట్టడి చేయడంలో రైనర్​ భద్రతా సిబ్బంది విఫలమయ్యారన్నది వాటిలో ప్రధానమైంది. అయితే.. తప్పు తమది కాదని ఆయన గత కొంత కాలంగా పోరాడుతూనే ఉన్నారు.

ఇదీ చదవండి: షీ జిన్​పింగ్​ రికార్డ్.. మూడోసారి చైనా అధ్యక్షునిగా ఎన్నిక

సవాళ్ల మధ్య బైడెన్‌కు 'మధ్యంతర పరీక్ష'.. నిలబడతారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.