ETV Bharat / international

మూడు దేశాల్లో భారీ భూకంపం.. రిక్టర్​ స్కేల్​పై 6.6 తీవ్రత - జపాన్​లో భారీ భూకంపం

Earthquake Taiwan today: జపాన్​, తైవాన్​ మధ్య సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై తీవ్రత 6.6గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. అమెరికా, సౌత్​కరోలినా రాజధాని కొలంబియాలోనూ భూమి కంపించింది.

TAIWAN-QUAKE
భూకంపం
author img

By

Published : May 9, 2022, 1:14 PM IST

Earthquake Taiwan today: ఈశాన్య తైవాన్​, నైరుతి జపాన్​ ప్రాంతాల మధ్య సముద్రంలో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 11.53 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు ఐరోపా భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది. రిక్టర్​ స్కేల్​పై తీవ్రత 6.6గా నమోదైందని, యోనగుని ప్రాంతానికి నైరుతి దిశలో 68 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు తెలిపింది. అయితే, సునామీ వచ్చే ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది.

సముద్రంలో 27 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉన్నట్లు తైవాన్​ వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్రత 6.1గా తెలిపింది. మరోవైపు.. అమెరికా జియోలాజికల్​ సర్వే.. 6.3 తీవ్రత నమోదైనట్లు వెల్లడించింది.

అమెరికాలో కంపించిన భూమి: అమెరికా, సౌత్​ కరోలినా రాష్ట్ర రాజధాని కొలంబియాలో భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై 3.3 తీవ్రత నమోదైనట్లు అమెరికా జియోలాజికల్​ సర్వే తెలిపింది. ఎలిగన్​ ప్రాంతంలో 3.1కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. ఆ ప్రాంతం కొలంబియాకు ఈశాన్యంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని తెలిపింది. మరోవైపు.. ఆస్తి, ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. రాత్రి 1.30 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు సామాజిక మాధ్యమాల వేదికగా తమకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు.

ఇదీ చూడండి: జానపద కళాకారుడిపై డాలర్ల వర్షం.. వీడియో వైరల్​

బస్సులో సీక్రెట్​ క్యాబిన్​.. డౌట్​ వచ్చి చూస్తే 2500 కిలోల వెండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.