ETV Bharat / international

Donald Trump Fund Raising : ట్రంప్​కు 2రోజుల్లోనే రూ.58 కోట్ల విరాళాలు... హాట్​కేకుల్లా మగ్​షాట్​ టీషర్టులు సేల్​! - ట్రంప్ విరాళాలు సేకరణ

Donald Trump Fund Raising For US Elections 2024 : అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ బృందం భారీగా నిధులు సేకరిస్తోంది. ట్రంప్ జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి ఫండ్స్​ వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. మాజీ అధ్యక్షుడు మగ్​షాట్​ టీషర్టులు, మగ్​లు, కూజీలకు విపరీతమైన డిమాండ్​ ఏర్పడుతోంది.

Donald Trump Fund Raising For US Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 11:37 AM IST

Updated : Aug 27, 2023, 12:32 PM IST

Donald Trump Fund Raising : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బృందం భారీగా నిధులు సేకరిస్తోంది. ఆయన.. జార్జియా జైలుకు వెళ్లి విడుదలైనప్పటి నుంచి 7.1 మిలియన్‌ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 58 కోట్ల నిధులను సేకరించగలిగినట్లు ట్రంప్‌ బృందం ప్రకటించింది. జైలుకు వెళ్లి మగ్‌షాట్‌ నమోదైన కూడా ఇంత భారీగా నిధులు సమకూరుతుండటం గమనార్హం. నేరారోపణలు, ఫుల్టన్ కౌంటీ జైలులో లొంగిపోవడం నేపథ్యంలో గత మూడు వారాల్లో ట్రంప్​ 20 మిలియన్ డాలర్లు నిధులు సేకరించారు. జార్జియాలో ట్రంప్​ను అరెస్టు చేసిన తర్వాత ఒక్క రోజులో 4.8 మిలియన్​ డాలర్ల నిధులు సమీకరించారని.. ఇది మొత్తం అతడి ప్రచారంలోనే అత్యధికమైన సంఖ్య అని అమెరికా మీడియా ఒక నివేదికలో పేర్కోంది.

ట్రంప్ మగ్​షాట్​కు ఫుల్​ గిరాకీ..
ఎన్నికల ప్రచారానికి ట్రంప్‌ ఈ మగ్‌షాట్‌ను (Donald Trump Mugshot) ఉపయోగించుకుని సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. మగ్‌షాట్‌ గురించి చెప్పిన ట్రంప్‌.. ఏ తప్పూ చేయనప్పుడు విచారణ ఎదుర్కోవడం అసౌకర్యంగా ఉంటుందన్నారు. అటు ట్రంప్‌ మగ్‌షాట్‌తో ఉన్న టీ షర్టులు, మగ్‌లు, కూజీలు అమెరికా మార్కెట్‌లో హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

Donald Trump Mugshot t shirts
డోనాల్డ్​ ట్రంప్​ మగ్​షాట్​ టీషర్టులు​

Donald Trump Arrest : అయితే గురువారం (2023 ఆగస్టు 24)డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్టు అయ్యారు. 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు నమోదైన నేపథ్యంలో జార్జియాలోని ఫుల్టన్‌ కౌంటీ జైలు వద్ద లొంగిపోయారు. బెయిల్‌ కోసం రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించాలని ఆయన్ను అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్ని ఫాని విల్లీస్‌ ఆదేశించారు. దీంతో ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రంప్‌ జైలుకు వెళ్లారు. జైలులో 20 నిమిషాలు గడిపారు. అనంతరం బెయిల్‌పై ట్రంప్​ బయటకొచ్చారు. అయితే జైలులో ఉన్న 20 నిమిషాల గ్యాప్​లో అధికారులు పోలీసు రికార్డుల కోసం ఆయన మగ్​షాట్ (​అరెస్ట్​ అయ్యాక నిందితులు తమ వివరాలతో కూడిన పలక పట్టుకుంటే.. పోలీసులు తీసే ఫొటో)​ను తీశారు.

  • SOME PERSONAL NEWS! My youngest daughter Kim has an Etsy store (link below), and she just added a line of T-shirts and mugs for everyone who’s THRILLED about Trump’s mugshot! 😃

    Use the promo code JONCOOPERTWEETS10 to get 10% off any Trump mugshot merchandise that you purchase… pic.twitter.com/ScWiKiLcPh

    — Jon Cooper (@joncoopertweets) August 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Vivek Ramaswamy Polls : వైస్​ ప్రెసిడెంట్​గా పోటీకి వివేక్​ రామస్వామి ఓకే?.. ట్రంప్​ నామినేషన్​ పొందితేనే!

Trump Arrest : 'గురువారం నన్ను అరెస్టు చేస్తారు.. అంతా బైడెన్‌ ఆధీనంలోనే!'

Last Updated : Aug 27, 2023, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.