ETV Bharat / international

'నన్ను గెలవనీయకుండా కుట్రలు'- న్యాయమూర్తిపైనే విరుచుకుపడ్డ ట్రంప్!

Donald Trump Civil Fraud Case : రాజకీయ ప్రేరణతోనే తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. సుమారు 370 మిలియన్ డాలర్ల పరువునష్టం కేసులో విచారణ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Donald Trump Defies Judge :
Donald Trump Defies Judge :
author img

By PTI

Published : Jan 12, 2024, 7:35 AM IST

Donald Trump Civil Fraud Case : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మరోసారి గెలవకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. రాజకీయ ప్రేరణతోనే తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. సుమారు 370 మిలియన్ డాలర్ల పరువునష్టం కేసులో విచారణ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తమకే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఆర్థర్​ ఎంగోరాన్​పైనా ట్రంప్​ విరుచుకుపడ్డారు. న్యూయార్క్​ అటార్నీ జనరల్​తో కలిసి తనను ఓడించడానికి ప్రయత్నిస్తున్నట్లు సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారు.

"ఆర్థిక లావాదేవీలు సరిగ్గా ఉన్నాయి. అవినీతి జరిగినట్లు ఆధారాలు లేవు. 40 రోజులుగా సాగిన విచారణలో మాకు వ్యతిరేకంగా ఒక్కరూ కూడా సాక్ష్యం చెప్పలేదు. బ్యాంకులు ఇచ్చిన నగదును వారికి తిరిగి చెల్లించాం. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్య. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తులు నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నేను మళ్లీ గెలవకూడదని ఇదంతా చేస్తున్నారు. మీరు పరిధులు దాటి వెళ్లి దీనిపై విచారించాలి. రాజకీయ జోక్యంతోనే ఇది నడుస్తోంది. అసలు విచారణ సమయంలో నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఆయన వినడానికి ఇష్టపడని నిజాలను చెబుతాను కదా."
--డొనాల్డ్ ట్రంప్​, అమెరికా మాజీ అధ్యక్షుడు

అంతకుముందు విచారణ సమయంలో ట్రంప్​పై వేసిన పిటిషన్లను తిరస్కరించాలని ఆయన తరఫు న్యాయవాది క్రిస్​ కిస్​ విన్నవించారు. రియల్​ ఎస్టేట్​ వ్యాపారంలో జోక్యం చేసుకోవడానికి అటార్నీ జనరల్ తన అపరిమిత అధికారాలను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. న్యూయార్క్​ అటార్నీ జనరల్​ లెటిటియా జేమ్స్​ ట్రంప్​పై 370 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ కేసు వేశారు. రాష్ట్రంలో వ్యాపారం చేయకుండా నిషేధం విధించాలని కూడా ఇందులో కోరారు.

ట్రంప్ చర్చకే వీక్షకుల మొగ్గు
మరోవైపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్​ ట్రంప్​ ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మరో రిపబ్లిక్​ పోటీ దారులైన నిక్కీ హేలీ, రాన్​ డిసాంటిన్​ మధ్య జరిగిన చర్చ కంటే ట్రంప్​ ఇంటర్వ్యూనే ఎక్కువ మంది చూశారు. బుధవారం ఫాక్స్​ న్యూస్​ ఛానల్​లో టౌన్​ హాల్​లో జరిగిన ట్రంప్​ ప్రసంగాన్ని 4.3 మిలియన్ల మంది వీక్షించారు. అదే సమయంలో సీఎన్​ఎన్​లో ప్రసారం చేసిన మరో పోటీదారుల చర్చను కేవలం 2.6 మిలియన్ల మంది వీక్షించారు. ట్రంప్​ చర్చను అర్ధరాత్రి సమయంలో తిరిగి ప్రసారం చేయగా మరో 1.4 మిలియన్లు మంది చూశారని ఫాక్స్​ సంస్థ చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.