ప్రపంచవ్యాప్తంగా వాలంటైన్స్ డేను ఘనంగా జరుపుకున్నారు ప్రేమికులు. కానీ ఓ జంట మాత్రం వరల్డ్ రికార్డ్‌తో ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకొంది. వాలంటైన్స్ రోజున ఏదైనా డిఫరెంట్‌గా చేయాలనుకున్న ఈ జంట.. ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిపోయింది. అయినా.. ఆ జంట చేసిన అంత ప్రత్యేకత ఏమిటా? అని ఆలోచిస్తున్నారా!.. వీరు చేసిందల్లా ముద్దు పెట్టుకోవడమే. అయితే, అందరిలా లవర్స్ డే రోజున వీళ్లేమీ సాదాసీదాగా ముద్దు పెట్టుకోలేదు. నీటి అడుగున 4 నిమిషాలకు పైగా ఊపిరి బిగపట్టి లిప్ కిస్ పెట్టుకున్నారు. గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు.
దక్షిణాఫ్రికాకు చెందిన బెత్ నీల్, కెనడాకు చెందిన మైల్స్ క్లౌటియర్.. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీళ్లిద్దరూ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోనే కలిసి నివసిస్తున్నారు. ఈ ఏడాది వాలెంటైన్స్ రోజున ఏదో ఒకటి వినూత్నంగా చేయాలని వీళ్లు సంకల్పించుకున్నారు. ఈ క్రమంలోనే వీరికి ఓ ఐడియా తట్టింది. నీటి అడుగున ఎక్కువసేపు ముద్దు పెట్టుకొని, గిన్నిస్ రికార్డ్ సృష్టించాలని అనుకున్నారు. ఇందుకోసం వాళ్లు మాల్దీవ్స్‌కి వెళ్లి, అక్కడి కొన్ని వారాల పాటు సాధన చేశారు. చివరకు వారికి ఇది చేయగలమన్న నమ్మకం కలిగింది. ఇంకేముంది.. వాలెంటైన్స్ డే రోజు మాల్దీవ్స్‌లోనే వీళ్లిద్దరు ఓ పూల్ అడుగుభాగంలో మోకాళ్లపై కూర్చొని.. 4 నిమిషాల 6 సెకన్ల పాటు ముద్దు పెట్టుకున్నారు. దీంతో.. నీటి అడుగున ఎక్కువసేపు ముద్దు పెట్టుకున్న జంటగా వీళ్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు.
ఇంతకుముందు ఒక ఇటాలియన్ జంట 3 నిమిషాల 24 సెకన్ల పాటు నీటి అడుగున ముందు పెట్టుకుని.. వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 13 ఏళ్ల పాటు ఈ రికార్డ్ చెక్కుచెదరలేదు. ఇన్నేళ్ల తర్వాత నీల్, మైల్స్ జంట ఆ రికార్డ్‌ను బద్దలుకొట్టింది. ఆ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్విట్టర్లో షేర్ చేసింది. "ఈ ప్రేమ పక్షులు నీటి అడుగున ముద్దుల రికార్డును నెలకొల్పాయి.. ఎందుకంటే వారి ఉమ్మడి ప్రేమ సముద్రమే" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
-
These lovebirds set a new underwater kiss record since their joint love was the ocean 🌊❤️️ pic.twitter.com/ZF16onFfXf
— Guinness World Records (@GWR) February 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">These lovebirds set a new underwater kiss record since their joint love was the ocean 🌊❤️️ pic.twitter.com/ZF16onFfXf
— Guinness World Records (@GWR) February 14, 2023These lovebirds set a new underwater kiss record since their joint love was the ocean 🌊❤️️ pic.twitter.com/ZF16onFfXf
— Guinness World Records (@GWR) February 14, 2023
గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకోవడం పట్ల ఆ జంట ఆనందం వ్యక్తం చేసింది. మూడు రోజుల ముందు నుంచి చాలా ఆత్రుతగా ఉందని నీల్ తెలిపాడు. ఇప్పటికే ఉన్న గిన్నిస్ రికార్డును కూడా తాము చేరుకుంటామని అనుకోలేదని మైల్స్ చెప్పింది. కాగా, నీల్.. నాలుగు సార్లు దక్షిణాఫ్రికా ఫ్రీడైవింగ్ ఛాంపియన్‌గా నిలిచాడు.