ETV Bharat / international

న్యూజిలాండ్​ కొత్త ప్రధానిగా క్రిస్​ హిప్కిన్స్​! - chris hipkins labouor party newzwland

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా లేబర్​ పార్టీగా చెందిన క్రిస్ హిప్కిన్స్​ ఎన్నిక లాంఛనమైంది. ఇందుకోసం ఆదివారం లేబర్​ పార్టీ సభ్యుల ఆమోదం పొందాల్సి ఉంది.

chris hipkins new zealand pm
chris hipkins new zealand pm
author img

By

Published : Jan 21, 2023, 7:32 AM IST

Updated : Jan 21, 2023, 9:33 AM IST

New Zealand PM : న్యూజిలాండ్​ ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్​ రాజీనామాతో కొత్త ప్రధానమంత్రి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ విద్యాశాఖ మంత్రి క్రిస్​ హిప్కిన్స్​ కొత్త ప్రధానిగా ఎన్నిక కానున్నారు. జెసిండా స్థానంలో పోటీలో క్రిస్​ ఒక్కరే ఉండటం వల్ల ఆయన ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికోసం తన లేబర్​ పార్టీలోని సభ్యులతో ఆమోదం పొందాలి. పోటీలో ఒక్కరే ఉండటం వల్ల సభ్యుల ఆమోదం పొందడం ఇక లాంఛనమయింది. ఆ స్థానానికి పోటీ పడేందుకు పార్టీలో సరైన అభ్యర్థులు లేకపోవడం వల్ల.. చట్ట సభ్యులు హిప్కిన్స్​ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. కాగా, సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హిప్కిన్స్​కు దాదాపు 8 నెలల సమయం ఉంది. తన ప్రత్యర్థి కన్జర్వేటివ్​ పార్టీ కంటే లేబర్​ పార్టీ వెనుకంజలో ఉందని ఒపీనియన్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలో లేబర్​ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత హిప్కిన్స్​పై ఉంది.

కరోనా వైరస్​ ఉద్ధృతంగా ఉన్న సమయంలో సమర్థంగా బాధ్యతలు నిర్వహించి ప్రజల్లో గుర్తింపు పొందారు హిప్కిన్స్. కొత్త శైలి నాయకత్వానికి ఐకాన్​గా గుర్తింపు పొందిన జెసిండా ఆర్డెర్న్ నీడలో ఇంతకాలం ఉన్నందున ఆయన పేరు బయటకు రాలేదు. విద్యాశాఖతో పాటు, పోలీసు, పబ్లిక్​ సర్వీస్​ శాఖ బాధ్యతలు కూడా హిప్కిన్స్​ నిర్వర్తిస్తున్నారు. పార్టీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ట్రబుల్​ షూటర్​గా కూడా హిప్కిన్స్​కు పేరుంది. దీంతో పాటు లాక్​డౌన్​ సమయంలో ప్రజల్ని బయటకు వెళ్లొచ్చు అనే వ్యాఖ్యలతో విమర్శలు సైతం ఎదుర్కొన్నారు.

చట్ట సభ్యుడిగా 15 ఏళ్ల అనుభవం కలిగిన హిప్కిన్స్​.. ఆర్డెర్న్​ కన్నా సమతుల్య భావాలు కలిగిన వాడని పేరుంది. వచ్చే ఎన్నికల్లో దేశ ఆర్థిక వ్యవస్థ రూపంలో హాప్కిన్స్​కు పెద్ద సమస్య ఎదురుకానుంది. ఆర్థిక వ్యవస్థను తమ ప్రభుత్వం మెరుగుపరుస్తుందని హిప్కిన్స్​ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం న్యూజిలాండ్​ నిరుద్యోగం రేటు 3.2 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం 7.2 శాతంగా ఉంది. దీంతో దవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆ దేశ రిజర్వు బ్యాంకు వడ్డీ శాతాన్ని 4.25 శాతానికి పెంచింది. కాగా, ఈ ఏడాది న్యూజిలాండ్​ ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Last Updated : Jan 21, 2023, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.