China Corona News: చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మహమ్మారిని నియంత్రించేందుకు డ్రాగన్ దేశం తలలు పట్టుకుంటోంది. జీరో కొవిడ్ పాలసీ అంటూ ప్రపంచంలో ఏ దేశం అనుసరించని విధానాన్నిఅవలంబిస్తోంది. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న షాంఘైలో ఇప్పటికే లాక్‌డౌన్ అమలు చేస్తోంది. పెద్దఎత్తున పరీక్షలు చేస్తోంది. తాజాగా మహమ్మారి కట్టడికి సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది.
Shanghai Corona Restrictions: కలిసి తినొద్దు.. జంటగా నిద్రించొద్దు.. ముద్దులు, కౌగిలింతలు వద్దేవద్దు.. ఇవీ కరోనా వ్యాప్తిని నిలువరించడానికి చైనా ప్రభుత్వం తాజాగా విధించిన వింత ఆంక్షలు. జంటగా నిద్రించొద్దని, ముద్దులు, కౌగిలింతలకు అనుమతి లేదంటూ షాంఘైలో వీధివీధీ తిరుగుతూ ఆరోగ్యసిబ్బంది మైకులతో ఊదరగొడుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని, స్వేచ్ఛ కావాలన్న కోరికను నియంత్రించుకోవాలని డ్రోన్ల ద్వారా ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలు కాసేపు ప్రశాంతంగా గడిపేందుకు బాల్కనీలోకి వచ్చినా.. డ్రోన్లు ప్రత్యక్షమై లోపలకు వెళ్లాలని హెచ్చరిస్తున్నాయి. ఈ వీడియోను స్థానిక జర్నలిస్టులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
-
As seen on Weibo: Shanghai residents go to their balconies to sing & protest lack of supplies. A drone appears: “Please comply w covid restrictions. Control your soul’s desire for freedom. Do not open the window or sing.” https://t.co/0ZTc8fznaV pic.twitter.com/pAnEGOlBIh
— Alice Su (@aliceysu) April 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">As seen on Weibo: Shanghai residents go to their balconies to sing & protest lack of supplies. A drone appears: “Please comply w covid restrictions. Control your soul’s desire for freedom. Do not open the window or sing.” https://t.co/0ZTc8fznaV pic.twitter.com/pAnEGOlBIh
— Alice Su (@aliceysu) April 6, 2022As seen on Weibo: Shanghai residents go to their balconies to sing & protest lack of supplies. A drone appears: “Please comply w covid restrictions. Control your soul’s desire for freedom. Do not open the window or sing.” https://t.co/0ZTc8fznaV pic.twitter.com/pAnEGOlBIh
— Alice Su (@aliceysu) April 6, 2022
China Lockdown News: అంతేకాదు లాక్‌డౌన్ సమయంలో వీధుల్లో రోబోలు ప్రత్యక్షమై కరోనా జాగ్రత్తల గురించి ప్రచారం చేస్తున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని, శాస్త్రీయ పద్ధతుల్లో వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని ప్రజలకు హితబోధ చేస్తున్నాయి. షాంఘై జనాభా రెండు కోట్ల 60 లక్షలు కాగా.. రెండు వారాలకు పైగా అమలవుతున్న లాక్‌డౌన్ కారణంగా నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, అత్యవసరాల పంపిణీపై పెద్దఎత్తున అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
-
Robot roaming the streets making health announcements in #Shanghai during lockdown. pic.twitter.com/64x0mU4C2D
— Eric Feigl-Ding (@DrEricDing) March 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Robot roaming the streets making health announcements in #Shanghai during lockdown. pic.twitter.com/64x0mU4C2D
— Eric Feigl-Ding (@DrEricDing) March 31, 2022Robot roaming the streets making health announcements in #Shanghai during lockdown. pic.twitter.com/64x0mU4C2D
— Eric Feigl-Ding (@DrEricDing) March 31, 2022
ఇదీ చదవండి: భారత్లోని పవర్ గ్రిడ్లపై చైనా సైబర్ దాడులు.. కీలక డేటా చోరీ!