ETV Bharat / international

కెనడా షాకింగ్​ నిర్ణయం!- స్టూడెంట్ వీసా డిపాజిట్ డబుల్​- 20వేల డాలర్లకుపైగా ఉండాల్సిందే! - కెనడా వీసా డిపాజిట్ డబుల్

Canada Student Visa Deposit : కెనడా స్టూడెంట్‌ పర్మిట్‌ డిపాజిట్‌ను ప్రస్తుతమున్న 10వేల డాలర్ల నుంచి 20వేల డాలర్లకు పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కెనడా వెళ్లాలనుకునే విద్యార్థులపై అధిక భారం పడనుంది!

Canada Student Visa Deposit
Canada Student Visa Deposit
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 8:26 PM IST

Canada Student Visa Deposit : ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లే విదేశీ విద్యార్థులపై నిబంధనలను కఠినతరం చేస్తోంది అక్కడి ప్రభుత్వం. స్టడీ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకొనే విద్యార్థుల ఆర్థిక సంసిద్ధతను పెంచేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో స్టూడెంట్‌ డిపాజిట్‌ను ప్రస్తుతమున్న 10వేల డాలర్ల నుంచి 20,635 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.

"కెనడాలో జీవన వ్యయం విషయంలో అంతర్జాతీయ విద్యార్థులు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అందుకే జీవన వ్యయ పరిమితిని సవరిస్తున్నాం. తద్వారా ఇక్కడి పరిస్థితులను వారు అర్థం చేసుకోగలరు. విద్యార్థుల అవసరాలకు తగిన వసతి కల్పనకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నాం. ఆర్థిక బలహీనత, దోపిడీ నుంచి అంతర్జాతీయ విద్యార్థులను తాజా నిర్ణయాలు రక్షిస్తాయి."
--మార్క్‌ మిల్లర్‌, కెనడా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి

తాజా నిర్ణయం కేవలం పెరుగుతున్న జీవన వ్యయానికి సంబంధించే కాకుండా తగిన వసతిని పొందడంలోనూ అంతర్జాతీయ విద్యార్థులకు దోహదపడుతుందన్నారు మార్క్ మిల్లర్​. వీటితోపాటు అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్‌ బయట పని పరిమితిపై ఇచ్చిన మినహాయింపు (వారానికి 20 గంటల కంటే ఎక్కువ)ను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కెనడాలో ఉన్నవారితోపాటు డిసెంబర్‌ 7నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు.

కెనడాలో ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి అవసరమైన జీవన వ్యయం డిపాజిట్‌ను అక్కడి ప్రభుత్వం కొన్నేళ్లుగా మార్చలేదు. స్టూడెంట్‌ క్యాడ్‌ కింద నివాస, వసతి కోసం ఒక్కో దరఖాస్తుదారుడు 10వేల డాలర్లు డిపాజిట్‌ చేయాలి. కాలక్రమేణా జీవన వ్యయం పెరగడం వల్ల విద్యార్థులు ఇక్కడకు చేరుకున్న తర్వాత అవి సరిపోవడం లేదని కెనడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీటి కోసం 20,635 డాలర్లు ఉన్నట్లు దరఖాస్తుదారుడు చూపించాల్సి ఉంటుంది. తొలి ఏడాది ట్యూషన్‌ ఫీజు, ప్రయాణ ఖర్చులకు ఇది అదనం. 2024 జనవరి 1 తర్వాత కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ మార్పు వర్తిస్తుందని కెనడా ఇమ్మిగ్రేషన్‌ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ ప్రోగ్రాంలో సంస్కరణలు చేపట్టనున్నట్లు ఈ ఏడాది అక్టోబర్‌ 27న వెల్లడించిన కెనడా ప్రభుత్వం పలు నిర్ణయాలను వెల్లడిస్తోంది.

కెనడా పౌరులకు ఈ-వీసాలు జారీ- రెండు నెలల తర్వాత మళ్లీ షురూ!

Canada Embassy India : భారత అల్టిమేటం సక్సెస్.. డెడ్​లైన్​కు ముందే సింగపూర్​కు కెనడా దౌత్యవేత్తలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.