ETV Bharat / international

బ్రిటన్​ హోంమినిస్టర్​పై సునాక్​ వేటు- మాజీ ప్రధానికి విదేశాంగ మంత్రి పదవి - బ్రిటన్​ హోం మంత్రికి సునాక్​ గుడ్​బై కారణం

Britain Cabinet Reshuffle : బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ దేశ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించారు. మరోవైపు, విదేశాంగ మంత్రిగా మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్​ను నియమించారు.

British Cabinet Reshuffle
British Cabinet Reshuffle
author img

By PTI

Published : Nov 13, 2023, 2:59 PM IST

Updated : Nov 13, 2023, 4:17 PM IST

Britain Cabinet Reshuffle : బ్రిటన్​ ప్రధాని రిషి సునాక్​.. కేబినెట్​ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. అందులో భాగంగా ఆ దేశ హోం మంత్రి, భారత సంతతి నాయకురాలు సుయెల్లా బ్రేవర్మన్​(43)కు ఉద్వాసన పలికారు. కొత్త హోం మంత్రిగా జేమ్స్​ క్లెవర్లీని నియమించారు. మరోవైపు, విదేశాంగ మంత్రిగా మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్​ను నియమిస్తూ అరుదైన నిర్ణయం తీసుకున్నారు.

సుయెల్లా బ్రేవర్మన్ ఉద్వాసనకు కారణమిదే!
Britain Home Minister News Today : గత నెలలో ఇజ్రాయెల్​- హమాస్​ యుద్ధం ప్రారంభమైన తర్వాత.. బ్రిటన్​లో పాలస్తీనా మద్దతుదారులు పెద్దఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ర్యాలీల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లుగా కొద్దిరోజుల క్రితం సుయెల్లా బ్రేవర్మన్ ఆరోపించారు. ఇజ్రాయెల్​- హమాస్​ యుద్ధం నేపథ్యంలో లండన్​లో గత నెలలో జరిగిన భారీ నిరసన ర్యాలీని సుయెల్లా ఖండించారు. ఆ ర్యాలీని 'విద్వేష కవాతు​'గా అభివర్ణించారు. పోలీసుల తీరుపై సుయెల్లా వైఖరికి సంబంధించిన వ్యాసాలను ఓ అంతర్జాతీయ పత్రిక ప్రచురించింది. అప్పటి నుంచి ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలని సునాక్​పై ఒత్తిడి పెరిగింది. దీంతో సోమవారం.. ఆమెకు సునాక్​ ఉద్వాసన పలికినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.

  • British PM Rishi Sunak sacks interior minister Suella Braverman following comments she made last week about the police's handling of a pro-Palestinian march, reports Reuters.

    (Photo source: X account of Suella Braverman) pic.twitter.com/6L3tzcVF7q

    — ANI (@ANI) November 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • James Cleverly appointed the Secretary of State for the Home Department in the Government of the UK.

    Reuters reported that British PM Rishi Sunak sacked Home Secretary Suella Braverman today following comments she made last week about the police's handling of a pro-Palestinian… pic.twitter.com/fef4NXmu8E

బ్రిటన్‌ కేబినెట్‌లో సుయెల్లా బ్రేవర్మన్‌ సీనియర్‌ మంత్రి. గతంలో మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ మంత్రివర్గంలో కూడా ఆమె పనిచేశారు. అప్పట్లో లిజ్‌ ట్రస్‌ ప్రభుత్వం గందరగోళ సమయాన్ని ఎదుర్కొంటోందని విమర్శలు చేశారు. అదే సమయంలో వలసల అంశంపై అధికారిక పత్రాలకు సంబంధించి నిబంధనలను ఉల్లఘించినందుకు బాధ్యత వహిస్తూ.. ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం రిషి సునాక్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక.. ఆమెకు మద్దతుగా నిలిచి మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం వల్ల మరోసారి పదవి కోల్పోయారు.

విదేశాంగ మంత్రిగా మాజీ ప్రధాని..
మరోవైపు, బ్రిటన్ విదేశాంగ శాఖ బాధ్యతలను మాజీ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌కు అప్పగించారు సునాక్. అయితే ఓ మాజీ ప్రధాని, చట్టసభల్లో లేని నేతకు ఇలా కేబినెట్‌లో స్థానం కల్పించడం బ్రిటన్​ రాజకీయాల్లో అరుదు. త్వరలోనే ఆయనను ఎగువ సభకు నామినేట్‌ చేయనున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం వెల్లడించింది. కామెరూన్‌ 2010 నుంచి 2016 వరకు యూకే ప్రధానిగా వ్యవహరించారు.

Rishi Sunak Visits Akshardham Temple : అక్షర్​ధామ్ ఆలయంలో సునాక్​ దంపతుల పూజలు.. హరిత నిధికి 2 బిలియన్ డాలర్ల విరాళం

రిషి సునాక్​కు 'కోహ్లీ బ్యాట్' గిఫ్ట్- మోదీ తరఫున దీపావళి విషెస్​ చెప్పిన జైశంకర్

Last Updated : Nov 13, 2023, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.