ETV Bharat / international

Brics Summit 2023 Modi Speech : 'భిన్నత్వమే భారత్‌కు అతిపెద్ద బలం'.. బ్రిక్స్ సమ్మిట్​లో మోదీ

Brics Summit 2023 Modi Speech : సాంకేతికత ఉపయోగించి ప్రజాసేవాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న 15వ బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. బ్రిక్స్‌ను.. భవిష్యత్తు సన్నద్ధత సంస్థగా మార్చేందుకు సభ్యదేశాల ప్రజలను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Brics Summit 2023 Modi Speech
Brics Summit 2023 Modi Speech
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 5:06 PM IST

Updated : Aug 23, 2023, 5:51 PM IST

Brics Summit 2023 Modi Speech : బ్రిక్స్‌ను.. భవిష్యత్తు సన్నద్ధత సంస్థగా మార్చేందుకు సభ్యదేశాల ప్రజలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ క్రతువులో సాంకేతికత కీలక భూమిక పోషిస్తుందన్నారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న 15వ బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. సాంకేతికత ఉపయోగించి ప్రజాసేవాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు చెప్పారు. భిన్నత్వమే భారత్‌కు అతిపెద్ద బలమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

  • #WATCH | India fully supports the expansion of BRICS, we welcome moving forward with consensus on this: PM Modi at the open plenary session of the 15th BRICS Summit pic.twitter.com/37CB4H3U0l

    — ANI (@ANI) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"బ్రిక్స్‌ను ఒక భవిష్యత్తు సన్నద్ధత సంస్థగా తయారుచేసేందుకు మనదేశ ప్రజలను కూడా భవిష్యత్తు కోసం సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందులో సాంకేతికత కీలకపాత్ర పోషిస్తుంది. భారత్‌లో మేం మారుమూల ప్రాంతాల బాలబాలికలకు విద్యను చేరువ చేసేందుకు దీక్షా ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశాం. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణల సామర్థ్యం పెంచటానికి దేశవ్యాప్తంగా అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. భాషా సంబంధిత సమస్యల పరిష్కారానికి భారత్‌లో కృత్రిమమేథ ఆధారిత భాషావేదిక భాషిణీని ఉపయోగిస్తున్నాం. వ్యాక్సినేషన్‌ కోసం కోవిన్‌ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశాం. డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మాధ్యమం ద్వారా ప్రజాసేవల్లో విప్లవాత్మక మార్పు తెచ్చాం. భిన్నత్వం భారత్‌ అతిపెద్ద బం. భారత్‌లో ఏ సమస్యకైనా ఈ భిన్నత్వం ద్వారానే పరిష్కారం లభిస్తుంది."

--నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

  • VIDEO | “To give a new path to the BRICS agenda, India had put forth suggestions on issues such as railway research network, close cooperation between MSMEs, online BRICS database and startup firms. I am happy that a lot of progress was made on these issues,” says PM Modi at… pic.twitter.com/Nl9UGxLZrD

    — Press Trust of India (@PTI_News) August 23, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

మోదీ తీరుపై ప్రశంసల జల్లు
Modi in South Africa : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తన తీరుతో అందరితో ప్రశంసలు అందుకున్నారు. బుధవారం 15వ బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఇతర దేశాల అధినేతలతో కలిసి ఫొటో దిగేందుకు వేదికపై వచ్చారు. ఈ సమయంలోనే గ్రూప్‌ ఫొటో దిగేందుకు వచ్చిన మోదీకి.. వేదికపైన మన జాతీయ పతాక రంగులతో ఉన్న ఓ కాగితం కనిపించింది. తాము నిలబడే దగ్గర ఆ కాగితం ఉండటం వల్ల ప్రధాని వెంటనే స్పందించారు. ఆ కాగితాన్ని అక్కడి నుంచి తీసి, తన జేబులో పెట్టుకున్నారు. ఆయన వెంటే ఉన్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా కూడా మోదీ మార్గాన్నే అనుసరించారు. అక్కడున్న మరో కాగితాన్ని తీసి.. తన సహాయకులకు అందించారు. ప్లీనరీ సమావేశానికి ముందు ఈ ఘటన జరిగింది.

  • VIDEO | During the group photo at BRICS Summit in Johannesburg, PM Modi noticed the Indian Tricolour on the ground, which was kept to denote standing position of leaders. PM Modi immediately picked the national flag and kept it with him. South African President Cyril Ramaphosa,… pic.twitter.com/9lDMUhD8hs

    — Press Trust of India (@PTI_News) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో చర్చలు
Pm Modi South Africa Visit 2023 : అనంతరం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ప్రధాని మోదీ. ఇరు దేశాల సంబంధాల బలోపేతంపై చర్చించారు. రక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, ఆరోగ్య రంగాల్లో ఇరు దేశాలు సాధించిన ప్రగతిపై సంతోషం వ్యక్తం చేశారు.

'త్వరలో 5 ట్రిలియన్​ ఆర్థిక వ్యవస్థగా భారత్'.. ​బ్రిక్స్ సదస్సులో మోదీ

PM Modi South Africa Visit : బ్రిక్స్​ సమ్మిట్​కు ప్రధాని మోదీ.. జిన్​పింగ్​తో భేటీ అవుతారా?

Last Updated : Aug 23, 2023, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.