ETV Bharat / international

అమెరికాలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా హైదరాబాదీ 'అరుణ'

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఓ మహిళ చరిత్ర సృష్టించారు. మేరీలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తెలుగు నేపథ్యం ఉన్న అరుణా మిల్లర్‌ ఎన్నికయ్యారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్‌ కావడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.

Maryland Lieutenant Governor aruna miller

author img

By

Published : Nov 9, 2022, 4:52 PM IST

అమెరికా మధ్యంతర ఎన్నికలు మంగళవారం పూర్తవ్వగా.. ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో మేరీలాండ్‌ గవర్నర్‌ పదవి కోసం డెమోక్రటిక్‌ నాయకుడు వెస్‌ మూర్‌తో పాటు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ స్థానానికి అరుణా మిల్లర్‌ అనే భారత సంతతికి చెందిన మహిళ పోటీ చేశారు. ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులపై వీరిద్దరూ ఘన విజయం సాధించారు. గవర్నర్‌ తర్వాత అత్యున్నత హోదాలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఉంటారు. ఒకవేళ గవర్నర్‌ సరైన రీతిలో విధులు నిర్వర్తించలేని సమయంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తారు.

మేరీలాండ్‌లో అరుణకు ప్రజాదరణ ఎక్కువ. రిపబ్లికన్‌ మద్దతుదారులు కూడా ఆమెకు అనుకూలంగా పనిచేసినట్లు తెలుస్తోంది. వెస్‌ మూర్‌, అరుణ విజయం కోసం అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ మేరీలాండ్‌లో విస్తృతంగా ప్రచారం చేశారు. 58ఏళ్ల అరుణా మిల్లర్‌ హైదరాబాద్‌లో జన్మించారు. ఆమెకు ఏడేళ్ల వయసున్నప్పుడు 1972లో ఆమె కుటుంబం అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడింది.

ఇదీ చదవండి:'కాప్‌-27' సమావేశం నుంచి బయటికెళ్లిన రిషి సునాక్.. చెవిలో చెప్పిన కొద్దిసేపటికే!

నేపాల్​లో భారీ భూకంపం.. ఆరుగురు మృతి.. భారత్​ను తాకిన ప్రభావం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.