ETV Bharat / international

అబార్షన్‌ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు

author img

By

Published : Jun 25, 2022, 5:04 AM IST

Abortion law in us: యాభై ఏళ్లుగా అమలులో ఉన్న అబార్షన్ హక్కును రద్దు చేస్తున్నట్లు సంచలన తీర్పు వెలువరించింది అమెరికా సుప్రీం కోర్టు. తీర్పుపై కొంతమంది హర్షం వ్యక్తం చేయగా.. మరికొంత మంది విభేదిస్తున్నారు. ఈ రోజు కోర్టుకు, అమెరికాకు చాలా విచారకరమైన రోజు అధ్యక్షుడు బైడెన్​ తెలిపారు.

ABORTION
అమెరికా సుప్రీం

Abortion law in us: అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దాదాపు యాభై ఏళ్లుగా అమలులో ఉన్న అబార్షన్ హక్కును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. "రాజ్యాంగం అబార్షన్ హక్కును కల్పించలేదు. రో, కేసీ కేసులో ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నాం. అబార్షన్‌కు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రజలకే తిరిగి దక్కుతుంది" అని కోర్టు వ్యాఖ్యానించింది. అబార్షన్‌ను నియంత్రించేలా రాష్ట్రాలు ఇకపై చట్టాలు, అధికారాలు చేయవచ్చని స్పష్టం చేసింది.

అమెరికాలో 1973లో 'రో వర్సెస్‌ వేడ్' కేసులో మహిళలు అబార్షన్‌ చేయించుకోవడాన్ని రాజ్యాంగ హక్కుగా కల్పిస్తూ గతంలో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. దీంతో ఆనాటి నుంచి అక్కడ అబార్షన్లు చట్టబద్ధమయ్యాయి. అయితే నియంత్రణ లేని అబార్షన్లు, మహిళల ఆరోగ్యంపై ప్రభావంపై అమెరికాలోని కొన్ని వర్గాలు గత కొన్నేళ్లుగా పోరాడుతున్నాయి. అబార్షన్‌ హక్కును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

మరోవైపు అబార్షన్లపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కొంతమంది హర్షం వ్యక్తం చేయగా.. మరికొంత మంది విభేదిస్తున్నారు. ఈ క్రమంలో వందలాది మంది అమెరికన్లు సుప్రీంకోర్టు ఎదుట గుమిగూడారు. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కాసేపటికే సుమారు 25 నుంచి 50 రాష్ట్రాలు అబార్షన్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం అబార్షన్‌ను నిషేధించిన తొలి రాష్ట్రంగా నిలిచింది.

విచారకరమైన రోజు.. అబార్షన్​ హక్కును రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. ఈ రోజు కోర్టుకు, అమెరికాకు చాలా విచారకరమైన రోజు అని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగ హక్కును ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఈ రోజు మహిళల ఆరోగ్యం, జీవితం ప్రమాదంలో పడింది అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పాక్​ సంపన్నులపై పిడుగు.. 'సూపర్ ట్యాక్స్' పేరిట 10% పన్ను

కరోనా టీకాల వల్ల 2కోట్ల మంది ప్రాణాలు సేఫ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.