ETV Bharat / international

సరిహద్దులో తొక్కిసలాట.. 23 మంది వలసదారుల దుర్మరణం - మొరాకో న్యూస్

Spain Morocco Border Migrants: ఆఫ్రికా మొరాకో, స్పెయిన్​ దేశ సరిహద్దుల్లో జరిగిన తొక్కిసలాటలో 23 మంది మరణించారు. స్పానిష్​కు చెందిన 140 మందికి పైగా భద్రతా సిబ్బంది గాయపడ్డారని.. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

stampede in morocco today
stampede in morocco today
author img

By

Published : Jun 25, 2022, 1:28 PM IST

Updated : Jun 26, 2022, 6:47 AM IST

Spain Morocco Border Migrants: ఆఫ్రికాలోని మొరాకో- స్పెయిన్​ దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు కంచె వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో 23 మంది దుర్మరణం పాలయ్యారు. 2వేల మందికి పైగా వలసదారులు.. ఒక్కసారిగా కంచెను దాటడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి వలసదారులు మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

"మొరాకో సరిహద్దు నుంచి స్పెయిన్​​ను వేరుచేసే కంచెను కత్తిరించడానికి వలసదారులు ప్రయత్నించారు. అప్రమత్తమై వలసదారులను అదుపు చేశాం. చాలా మంది వలసదారులు వెనక్కి తగ్గగా.. 130 మంది మాత్రం ఒక్కసారిగా కంచె వద్దకు దూసుకొచ్చారు."

-స్పెయిన్​​ భద్రతా అధికారులు

అంతకుముందు ఐదుగురు వలసదారులు మరణించారని పేర్కొనగా.. ఆస్పత్రికి తరలించిన అనంతరం ఈ సంఖ్య 23కు చేరింది. ఈ ప్రమాదంలో 75 మందికి పైగా గాయాలైనట్లు తెలిపింది. 140 మంది మొరాకో భద్రతా సిబ్బంది గాయపడ్డారని.. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పింది.

ఇదీ చదవండి: ముంబయి పేలుళ్ల సూత్రధారికి 15 ఏళ్ల జైలు శిక్ష

Last Updated : Jun 26, 2022, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.