కొందరు జంతుప్రేమికులు కుక్కలు, పిల్లుల నుంచి పులి వంటి క్రూరమృగాలను కూడా పెంచుకుని వార్తల్లో నిలుస్తారు. మరికొందరైతే.. పెంపుడు జంతువులను ఇంట్లో మనిషిగా భావించి.. పుట్టినరోజు వేడుకలు చేస్తారు. అయితే ఓ మహిళ ఏకంగా చింపాంజితోనే ప్రేమలో పడింది(Woman Affair With Chimpanzee). నాలుగేళ్లు దానిని కొనసాగించింది. ఈ విషయం తెలుసుకున్న జూ అధికారులు.. ఆమెపై నిషేధం విధించారు.
ఎక్కడంటే..?
బెల్జియంకు చెందిన ఆది టిమ్మర్‌మన్స్ జంతు ప్రేమికురాలు(animal lover). తరచూ జంతుప్రదర్శనశాలకు వెళ్తుండేది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న 'చిటా' అనే చింపాంజితో ప్రేమలో పడింది (love with Chimpanzee). దానిని చూసేందుకు 'యాంట్వెర్ప్ జూ'కు వెళ్తుండేది. ఆ చింపాంజి కూడా టిమ్మర్‌మన్స్.. తరచూ జూ కు రావడం గమనించేది. కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య బంధం ఏర్పడింది. దీంతో చిటా, టిమ్మర్‌మన్స్ ఒకరినొకరు చూసుకుంటూ.. గ్లాస్ ఎన్ క్లోజర్ ఎదురుగా నిలబడి సైగలతో సంభాషించుకునే వారు. గాల్లో ముద్దులు కూడా పెట్టుకునే వారు. ఇలా నాలుగేళ్లు గడిచిపోయాయి.
అయితే, నెమ్మదిగా చింపాంజిలో మార్పులు రావడం గమనించిన జూ సిబ్బంది టిమ్మర్మన్స్ను నిలదీశారు. దీంతో వారిద్దరి మధ్య 'అఫైర్' ఉందని టిమ్మర్‌మన్స్ చెప్పింది. ఫలితంగా ఆమె మళ్లీ 'జూ'కు రాకుండా నిషేధం విధించాలని నిర్ణయించారు. 'జూ'లో జంతువులపై మనుషులు ఎక్కువ ఆప్యాయతగా, ప్రేమగా మెలిగినా అవి వింతగా ప్రవర్తిస్తాయని.. వారితో తప్ప ఇతర జంతువులతో కలిసి ఉండలేవని చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే చిటాపై పెను ప్రభావం చూపుతుందనే కారణంతోనే టిమ్మర్మన్స్పై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన టిమ్మర్‌మన్స్.. "నేను ఆ జంతువును ప్రేమిస్తున్నా. అది నన్ను ప్రేమిస్తోంది. అంతకు మించి ఇంకేమీ లేదు. అధికారులు దానికి ఎందుకు అడ్డుపడుతున్నారు. మా మధ్య అఫైర్ నడుస్తోంది. అదే చెప్పాను" అని తెలిపారు. జూ అధికారుల నిర్ణయంతో ఏకీభవించనన్నారు.
ఇదీ చూడండి: గుర్రాల ఆకలి తీర్చుతున్న బాలిక