ETV Bharat / international

సింగిల్​ డోసు టీకాకు డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం - కొవిడ్ టీకా పంపిణీ

ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో టీకాకు ఆమోదం తెలిపింది. జాన్సన్​ అండ్​ జాన్సన్​ సంస్థ రూపొందించిన సింగిల్​ డోస్ వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.

vaccine, j&j vaccine
సింగిల్​ డోసు టీకాకు డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం
author img

By

Published : Mar 13, 2021, 5:34 AM IST

జాన్సన్​ అండ్ జాన్సస్​ రూపొందించిన సింగిల్ డోసు కొవిడ్​ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్​ను అత్యవసర వినియోగం కింద అనుమతిస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. కొత్త వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ విస్తృతం చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఐరోపాలోని 27 దేశాల్లో ఈ టీకాను అనుమతించాలని 'యూరోపియన్ మెడిసిన్స్​ ఏజెన్సీ' ప్రతిపాదించిన మరుసటి రోజే డబ్ల్యూహెచ్​ఓ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

టీకా సమర్థత..

జాన్సన్​ అండ్ జాన్సన్ వ్యాక్సిన్.. కరోనావైరస్​పై​ 85 శాతం ప్రభావితం చూపుతుందని ఇటీవల ఓ సర్వే వెల్లడించింది. ఇది దక్షిణాఫ్రికా సహా పలు ప్రమాదకర వేరియంట్లను కూడా ఎదుర్కోగలదని పేర్కొంది.

పంపిణీలో..

జాన్సన్​ టీకాలను కొవాక్స్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది జూలై నాటికి పంపిణీ చేసే అవకాశం ఉంటుందని డబ్ల్యూహెచ్​ఓ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సింగిల్​ డోసు టీకా కావడం, సాధారణ వాతావరణాల్లో భద్రపరచుకునే అవకాశం ఉండటం వల్ల అందరి దృష్టి ఈ వ్యాక్సిన్ మీద ఉందని తెలిపారు.

ఇదీ చదవండి : 'ఆ ప్రొటీన్ లోపం వల్లే ఐరోపాలో కరోనా ఉద్ధృతం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.