ETV Bharat / international

Vijay Mallya: విజయ్​ మాల్యాకు కోర్టులో మళ్లీ మొండిచెయ్యి - విజయ్​ మాల్యా అప్పీల్​ను తోసిపుచ్చిన బ్రిటన్​ ధర్మాసనం

కింగ్​ఫిషర్​ అధినేత విజయ్​ మాల్యా(vijay mallya) కు కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బ్రిటన్​, భారత్​లో కోర్టు ఖర్చులు భరించేందుకు న్యాయస్థానం పరిధిలో ఉన్న నిధులు(funds) విడుదల చేయాలన్న మాల్యా పిటిషన్​ను తిరస్కరించింది.

Vijay Mallya
విజయ్​మాల్యాకు కోర్టులో మళ్లీ మొండిచెయ్యి
author img

By

Published : May 27, 2021, 6:24 AM IST

ఆర్థిక నేరాల కింద వివిధ కేసులు ఎదుర్కొంటున్న కింగ్​ఫిషర్​ అధినేత విజయ్​ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్​లో, భారత్​లో కోర్టు ఖర్చులు భరించే నిమిత్తం న్యాయస్థానం(court) అధీనంలో ఉన్న నిధుల నుంచి కేటాయింపులు పెంచాలని కోరుతూ దాఖలు చేసిన అప్పీలును బ్రిటన్​ కోర్టు బుధవారం నిరాకరించింది. 7 లక్షల 50వేల పౌండ్లు కావాలని కోరిన విజయ్​ మాల్యా అందుకు తగ్గ రుజువులు చూపలేకపోయారని లండన్​ హైకోర్టు జడ్జి(High Court judge) స్పష్టం చేశారు.

కోర్టు నిధుల నుంచి తన ఖర్చులతోపాటు కోర్టు ఖర్చులకు మాల్యా 11 లక్షల పౌండ్లు వాడుకునేందుకు న్యాయమూర్తి ఫిబ్రవరిలో అనుమతించారు. ఇప్పటికే గత వాయిదాలోనూ మాల్యాకు వ్యతిరేకంగా.. ఎస్​బీఐ(sbi) నేతృత్వంలోని 13 భారతీయ బ్యాంకుల కూటమికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తదుపరి విచారణ జులై 26కు వాయిదా వేశారు.

ఇదీ చూడండి: బతుకు భారమై.. మెతుకు కరవై ఆటోకు నిప్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.