ETV Bharat / international

పెంపుడు జంతువుల నుంచి కరోనా? వైద్యులు ఏమంటున్నారు? - కరోనా వ్యాప్తి

ఇటీవల హాంకాంగ్​లో కరోనా సోకిన ఓ వ్యక్తి పెంపుడు కుక్కకూ వైద్య పరీక్షలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పెంపుడు జంతువుల నుంచి వైరస్​ వ్యాప్తి చెందుతుందని కొందరు భయాందోళన చెందుతున్నారు. అయితే వాటి వల్ల కరోనా సోకే అవకాశమే లేదని బ్రిటన్​కు చెందిన పుశువైద్య నిపుణులు చెబుతున్నారు.

Vets reassure pet owners over coronavirus fears
పెంపుడు జంతువులతో కరోనా.. వైద్యులు ఏమంటున్నారు?
author img

By

Published : Mar 13, 2020, 3:13 PM IST

పెంపుడు జంతువులతో కరోనా వస్తుందా?

చైనాలోని వుహాన్​లో ఉద్భవించిన కరోనా (కోవిడ్​-19) వైరస్​ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్​ వన్యప్రాణుల నుంచి వ్యాప్తి చెందిందని వైద్య అధికారులు భావిస్తున్నారు. కొన్ని దేశాల్లో శునకాలు, పిల్లుల కారణంగా వైరస్​ వ్యాప్తి చెందుతుందని భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ పెంపుడు జంతువుల వల్ల యజమానులకు గానీ, యజమానుల నుంచి పెంపుడు జంతువులకు గానీ వైరస్​ సోకే అవకాశాలు తక్కువని అంటున్నారు బ్రిటన్​ వైద్య నిపుణులు.

ఇటీవల హాంకాంగ్​లో వైరస్​ సోకిన వ్యక్తికి చెందిన పెంపుడు కుక్కకూ వైద్య పరీక్షలు నిర్వహంచినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే కొంత మంది వీటి వల్ల వైరస్​ వస్తుందనే భయంతో పెంపుడు జంతువులను చంపడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అయితే... వైరస్​ వ్యాప్తి అలా జరగదని, మూగ జీవాలకు హాని తలపెట్టవద్దని పశు వైద్యులు అభ్యర్థిస్తున్నారు.

సాధారణంగా ఏ జంతువులైనా ప్రత్యేకమైన కరోనా వైరస్​ను కలిగి ఉంటాయి. అయితే పెంపుడు జంతువుల నుంచి ఈ వైరస్​ సోకే అవకాశం లేదని వైద్యులు ఉద్ఘాటిస్తున్నారు. ఆందోళన చెందకుండా నిత్యం వాటికి స్నానం చేయిస్తూ శుభ్రంగా ఉంచాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అనారోగ్యానికి గురైతే చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, పెంపుడు జంతువులతో సన్నిహితంగా ఉండకూడదని చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.