12-15 సంవత్సరాల పిల్లలకు ఫైజర్ టీకాను అందించేందుకు బ్రిటన్ ఆరోగ్య నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు బ్రిటన్ ఆరోగ్య, సామాజిక సంరక్షణ విభాగం తెలిపింది.
12-15 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలపై ఫైజర్ జరిపిన క్లినికల్ ట్రయల్స్ డేటాను క్షుణ్నంగా పరిశీలించినట్లు యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ అధికారి జాన్ రైన్ వెల్లడించారు. వ్యాక్సిన్ సురక్షితమే కాక.. ప్రభావవంతమైనదని, పిల్లలకు మహమ్మారి ముప్పును తప్పిస్తుందని నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు.
ఆ దేశాల్లో ఇప్పటికే..
అమెరికా, ఐరోపా సమాఖ్య(ఈయూ) దేశాల్లో ఈ టీకాను 12-15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అందించేందుకు ఫైజర్ బయోఎన్‌టెక్ సంస్థకు ఇప్పటికే అనుమతులు లభించాయి. అమెరికాలో అందిస్తున్నారు కూడా. ఫ్రాన్స్, జర్మనీలు సైతం ఈ నెల నుంచి ప్రారంభించేందుకు ప్రణాళికలను రచిస్తున్నాయి.
ఇవీ చదవండి: పిల్లలపై 'కొవాగ్జిన్' ట్రయల్స్‌కు డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్