UNGA voting against Russia: ఉక్రెయిన్ విషయంలో ఐరాసలో జరిగిన ఓటింగ్‌కు భారత్ మరోసారి దూరమైంది. రష్యాకు వ్యతిరేకంగా ఐరాస జనరల్ అసెంబ్లీలో నిర్వహించిన ఓటింగ్‌లో 141 దేశాలు మద్దతు పలికాయి. 5 దేశాలు వ్యతిరేకించాయి. భారత్ సహా 35 దేశాలు ఓటింగ్‌కు పూర్తిగా దూరంగా ఉన్నాయి.
ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై తటస్థంగా వ్యవహరిస్తున్న భారత్.. ఎవరికీ ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడం లేదు. ఇరుపక్షాలు శాంతియుత మార్గాన్ని పాటించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలోనే రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు దూరంగా ఉంటోంది. ఇటీవల ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలపై ఓటింగ్‌కూ భారత్ దూరంగానే ఉంది.
ఇదీ చదవండి: యుద్ధ ప్రాతిపదికన పౌరుల తరలింపు... పాస్‌పోర్ట్ లేకున్నా..