ఇరాన్ అణుఒప్పందంలో అమెరికా తిరిగి చేరే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రాఫేల్ గ్రోసీ తెలిపారు. అయితే ఇందుకోసం ఇరుదేశాల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. యూరోపియన్ పార్లమెంటరీ కమిటీలతో వర్చువల్ సమావేశంలో ప్రసంగించిన ఆయన... అణు ఒప్పందం విషయంపై ఇరు దేశాధినేతలతో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు.
నిబంధనలను ఉల్లంఘిస్తోందన్న కారణంతో 2018లో అణుఒప్పందం నుంచి వైదొలిగింది అమెరికా.
ఇదీ చదవండి : 'క్వాడ్ కూటమిని అందరూ ఇష్టపడుతున్నారు'