బ్రిటన్‌లో కరోనా టీకా భద్రతపై అక్కడి ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతున్న వేళ.. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు ఆ దేశ యువరాజు ప్రిన్స్ విలియం. ప్రతిఒక్కరు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇందుకు తన నానమ్మ, బ్రిటన్ మహారాణి ఎలిజబెత్, తాత ఫిలిప్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఎలిజబెత్ 94 ఏళ్ల వయస్సులో, ఫిలిప్ 99 ఎళ్ల వయస్సులో టీకా తీసుకున్నట్లు గుర్తు చేశారు విలియం. చాలా మంది ప్రజలు టీకా తీసుకునేందుకు అయిష్టత చూపుతున్నారని ఇటీవల వైద్యసిబ్బందితో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు.. విలియం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై యువరాజు విలియం స్పందించారు. ప్రతిఒక్కరు కరోనా టీకా తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: కరోనా టీకా తీసుకున్న బ్రిటన్ రాణి ఎలిజబెత్