ETV Bharat / international

జీ7 విదేశాంగ మంత్రుల సదస్సు.. భారత్​కు ఆహ్వానం - UK Foreign Secretary Dominic Raab

లండన్​లో మే 3 నుంచి 5 వరకు జరగనున్న జీ-7 విదేశాంగ మంత్రుల సదస్సుకు భారత్​కు ఆహ్వానం లభించింది. భారత్​తో పాటు ఆస్ట్రేలియా, రిపబ్లిక్​ ఆఫ్ కొరియా, దక్షిణాఫ్రికాలను ఆహ్వానించినట్లు బ్రిటన్​ విదేశాంగ కార్యదర్శి డామినిక్ రాబ్​ తెలిపారు.

G7 Foreign Ministers' meeting
జీ-7 సదస్సు
author img

By

Published : Apr 21, 2021, 5:25 AM IST

లండన్​లో వచ్చే నెల జరగనున్న జీ-7 విదేశాంగ మంత్రుల సదస్సుకు భారత్​ను బ్రిటన్ ఆహ్వానించింది. ఆతిథ్య దేశ హోదాలో భారత్.. ఈ సమావేశంలో పాల్గొంటుందని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డామినిక్ రాబ్​ తెలిపారు. మే 3 నుంచి 5 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.

"జీ-7 దేశాలతో పాటు ఆతిథ్య దేశాలు సమావేశాల్లో పాల్గొంటే.. ఇండో- పసిఫిక్ ప్రాంత దేశాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సమస్యలపై విస్తృత అవగాహన ఏర్పడుతుంది. వచ్చే నెలలో జరగబోయే ఈ సమావేశం వల్ల.. ప్రస్తుత పరిస్థితులపై ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేసేందుకు అవకాశం లభిస్తుంది. యూకేలోని కరోనా నిబంధనల మేరకే ఈ సమావేశాలు జరుగుతాయి."

-డామినిక్​ రాబ్, బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి

ఈ సమావేశాల్లో భారత్​ తరపున భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్​ జైశంకర్ పాల్గొనే అవకాశం ఉంది. జీ-7 కూటమిలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా, బ్రిటన్​ దేశాలు శాశ్వత సభ్యులుగా ఉన్నాయి.

ఇదీ చదవండి : 'అలా చేస్తే కొన్ని నెలల్లోనే అదుపులోకి కరోనా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.