ETV Bharat / international

బ్రిటన్​లో 'ఒమిక్రాన్'​ కలకలం.. ఆ ఇద్దరికి..

దక్షిణాఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్‌.. ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే బోట్స్‌వాన, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌ దేశాల్లో కేసులు బయటపడగా.. తాజాగా రెండు ఒమిక్రాన్‌ కేసులు యూకేలో కూడా వెలుగు చూశాయి.

2 cases of new COVID-19 variant Omicron
బ్రిటన్​కు పాకిన ఒమిక్రాన్​
author img

By

Published : Nov 27, 2021, 9:02 PM IST

దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్తరకం కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌.. ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో పాటు బోట్స్‌వానా, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌ దేశాల్లో ఈ కేసులు బయటపడగా.. తాజాగా ఆ జాబితాలో బ్రిటన్​ చేరింది. ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్​ను గుర్తించనట్లు అక్కడి అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్​ సోకిన రోగులు చెమ్స్‌ఫోర్డ్, నాటింగ్‌హామ్‌లకు చెందిన వారని పేర్కొన్నారు. తాజా పరిణామాలతో.. మరో నాలుగు దేశాలు బ్రిటన్​ ప్రయాణ నిషేధిత జాబితాలో చేర్చినట్లు చెప్పారు.

కొత్తగా గుర్తించిన కేసులకు సంబంధించిన వారికి మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతున్న సమయంలో ఆ ఇద్దరు వ్యక్తులు హోం ఐసోలేషన్​లో ఉన్నారని పేర్కొన్నారు. వీరికి దక్షిణాఫ్రికా ప్రయాణికులతో సంబంధం ఉన్నట్లు స్పష్టం చేశారు.

ముందుజాగ్రత్త చర్యగా.. కొత్త కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆ దేశ హెల్త్​ సెక్రెటరీ సాజీద్​ జావిద్​ తెలిపారు. ఈ వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాత్మక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

జిన్​పింగ్​ కోసం కరోనా కొత్త వేరియంట్​కు 'ఒమిక్రాన్‌' పేరు !

'ఒమిక్రాన్'పై టీకాలు పనిచేస్తాయ్!

ప్రపంచానికి కరోనా 'కొత్త' ముప్పు.. ఆంక్షల చట్రంలోకి దేశాలు!

ఒమిక్రాన్​ వేరియంట్​ను 'ఫైజర్' ఎదుర్కొంటుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.