5కోట్ల బంగారు నగ..
నదీర్ మెటల్ రిఫైనరీ సంస్థ రూపొందించిన బంగారు ఆభరణంఅక్కడున్న వాటిలో అత్యంత ఖరీదైనది. దీని ధర 8లక్షల(రూ.5కోట్ల 5 లక్షలు) డాలర్లు. ఈ ఆభరణాన్ని అత్యధిక నాణ్యత గల బంగారంతో తయారు చేశారు. వీటిని ఫోర్నైన్స్(999.9) నాణ్యత గల ఆభరణాలని పిలుస్తారు.
ఇక్కడ అత్యంత ఖరీదైన నగలు ఉన్నాయి. వీటి బరువు 12.5 కేజీలు. అన్నీ ఫోర్నైన్స్ క్వాలిటీకి చెందినవి. విపణిలో వీటి ధర 6 లక్షల డాలర్లు(4కోట్ల 13 లక్షలు) ఉంటుంది. మొత్తం భాగం 8లక్షల డాలర్ల వరకు ఉంటుంది --కాన్ గోజూమ్, నదీమ్ మెటల్ రిఫైనరీ ఎక్స్పోర్ట్ మేనేజర్
టర్కీలో లభించే బంగారు ఆభరణాలకు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులున్నారు. టర్కీష్ సంప్రదాయ శైలీలో అటాసే జ్యువెలరీ డిజైనర్లు రూపొందించిన బ్యాక్‌గామన్ సెట్ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇది పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
మేము స్త్రీల కోసమే కాదు.. పురుషులకు నప్పే ఆభరణాలను కూడా తయారుచేస్తాం. వజ్రాలు పొదిగిన ఈ నగతో మగవాళ్లను ఆకర్షిస్తున్నాం. 100 క్యారెట్ల నాణ్యత గల వజ్రాలతో బ్యాక్‌గామన్ సెట్‌ను రూపొందించాం. ఈ మొత్తం సెట్ విలువ విపణిలో లక్షా 80వేల డాలర్ల(రూ.కోటి పైన) నుంచి2లక్షల డాలర్ల (రూ.కోటి 37లక్షలు)వరకు ఉంటుంది -- అటాసే కామెర్, అటాసే జ్యూవెలరీ సీఈఓ
బంగారం ఎగుమతుల్లో టర్కీ గత ఏడాది 35 శాతం వృద్ధిని సాధించింది. ముఖ్యంగా స్విట్జర్లాండ్, యూకే నుంచి ఎక్కవమంది కొనుగోలుదారులు టర్కీకి వస్తారు. తూర్పు మధ్య ఆసియా దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనూ టర్కీ నగలకు మంచి గిరాకీ ఉంది.