ETV Bharat / international

బాంబుల వర్షం.. క్షిపణి దాడులు.. రష్యా వాడుతున్న ఆయుధాలివే..

Russia Weapons Ukraine: ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా దాడుల చిత్రాలు, వీడియోలతో సోషల్‌ మీడియా నిండిపోయింది. ఈ క్రమంలో రష్యా భారీ సంఖ్యలో ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందుకోసం విమానాలు, క్షిపణులు, శతఘ్నులను, పదాతి దళాలను ఒక ప్యాకేజీలా వాడి ఉక్రెయిన్‌ను దెబ్బతీసింది. ఈ క్రమంలో గురువారం ఒక్కరోజే మొత్తం 80 స్థావరాలను ధ్వంసం చేసింది. రష్యా వాడిన ఆయుధాలివే..

russian weaponry
russian weaponry
author img

By

Published : Feb 25, 2022, 4:50 PM IST

Russia Weapons Ukraine: ఉక్రెయిన్​ను మూడువైపులా చుట్టుముట్టి విరుచుకుపడుతోంది రష్యా. పదులకొద్దీ సైనిక స్థావరాలు సహా పలు నగరాలపైనా దాడులు చేసింది. రాజధాని నగరం కీవ్​ ఆక్రమణే లక్ష్యంగా.. రష్యా సైన్యం క్షిపణి దాడులు చేపడుతోంది. షెల్లింగ్​లు ప్రయోగిస్తోంది. అయితే.. ఉక్రెయిన్​పై యుద్ధంలో రష్యా వాడుతున్న ఆయుధాలు ఏంటో తెలుసుకుందామా..?

శతఘ్నులు.. క్షిపణులు..

ఉక్రెయిన్‌ సరిహద్దుల సమీపంలోనే అసెంబ్లింగ్‌ చేసిన స్వల్ప, మధ్య శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులు, క్రూజ్‌ క్షిపణులు, శక్తిమంతమై శతఘ్నులు వినియోగించి ప్రభుత్వ భవనాల వంటి వాటిని లక్ష్యంగా చేసుకొన్నాయి. రష్యా దళాలు మొత్తం 160 క్షిపణులను ఉక్రెయిన్‌లోని లక్ష్యాలపై ప్రయోగించాయి. వీటిల్లో కల్బిర్‌ క్రూజ్‌ క్షిపణులు, సికిందర్‌ టాక్టికల్‌ బాలిస్టిక్‌ క్షిపణులు ఉన్నాయి. దీంతోపాటు క్రూజ్‌ క్షిపణులు, సముద్రంపై నుంచి దాడి చేసే క్షిపణలు, విమానాలపై నుంచి ప్రయోగించే క్షిపణులను వినియోగించినట్లు అమెరికా రక్షణ శాఖ వర్గాలు అంచనా వేశాయి. దీంతోపాటు స్మెర్చ్‌ రాకెట్‌ లాంఛర్లను కూడా వాడినట్లు ఉక్రెయిన్‌లో దొరికిన శకలాలు చెబుతున్నాయి. ఒక ట్రక్‌పై నుంచి 38 క్షణాల్లో 12 రౌండ్ల స్మెర్చిలను పేల్చగలదు. కాకపోతే వీటిపై లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే గైడెడ్‌ వ్యవస్థ ఉండదు. వీటితోపాటు ఉర్గాన్‌ మల్టీ రాకెట్‌ లాంచర్లను కూడా వినియోగించినట్లు భావిస్తున్నారు.

75 విమానాలు వాడి..

ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌ను చుట్టుముట్టిన తర్వాత రష్యా ప్రత్యేక విమానాలను కూడా సరిహద్దుల సమీపంలోకి తీసుకొచ్చింది. ఇవి క్లస్టర్‌ బాంబులు, పెద్ద ఎత్తున లోహపు తునకలు వెదజల్లే ఫ్రాగ్మెంటేషన్‌ బాంబులను ప్రయోగించగలవు. వీటితోపాటు గగనతలం నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే క్షిపణులతో దాడి చేయగలవు. ఇలాంటివి మొత్తం 75 విమానాలను ఉక్రెయిన్‌పై దాడికి వాడినట్లు అమెరికా రక్షణ రంగ నిపుణులు వెల్లడించారు. దీంతోపాటు కీవ్‌ వైపు దాదాపు రెండు డజన్ల ఎంఐ-8 హెలికాప్టర్లను కూడా వినియోగించారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి, మందుగుండు గోదాములను పేల్చి వేయడానికి వినియోగించారు. దీంతోపాటు కీవ్‌ వద్ద కొన్ని థర్మల్‌ పవర్‌ ప్లాంట్లను కూడా ధ్వంసం చేశారు.

గ్రౌండ్‌ వెహికల్స్‌..

రష్యా భారీ ఎత్తున సాయుధ వాహనాలు, ట్యాంకులను ఈ దాడికి వాడింది. ఈ క్రమంలో ఈశాన్య సరిహద్దుల్లో ఉన్న గ్లుఖోవ్‌ వద్ద అమెరికా సరఫరా చేసిన జావెలిన్‌ క్షిపణితో ఓ టి-72 ట్యాంక్‌ను ఉక్రెయిన్‌ ధ్వంసం చేసిన చిత్రాలూ వెలుగులోకి వచ్చాయి. దీనికి తోడు రష్యాకు చెందిన చాలా వాహనాలు తమ గుర్తింపు తెలిసే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేసుకొని ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాయి.

ఇవీ చూడండి: కమెడియన్​ To ప్రెసిడెంట్​... యుద్ధం వేళ జెలెన్​స్కీ ప్రస్థానం!

ఆ 27 దేశాలను నమ్మి ఉక్రెయిన్​ మోసపోయిందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.