బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత నేషనల్ హెల్త్‌కేర్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) పార్లమెంటరీ అవార్డ్‌ను డాక్టర్ ఘట్టమనేని హనుమంతరావు దక్కించుకున్నారు. బాల్యంలో వచ్చే కేన్సర్‌ను నయం చేయడం సహా.. 44 ఏళ్ల నుంచి క్రిస్టీ ఆస్పత్రి వైద్యునిగా ఆయన అసమాన సేవలందించారు. ఆ విశిష్ట సేవలకు గుర్తింపుగా హనుమంతరావును నామినేట్ చేశారు ఎంపీ జెఫ్ స్మిత్.
జాతీయ ఆరోగ్య సేవలు ప్రారంభమైన 70వ ఏట ఎన్హెచ్ఎస్ పార్లమెంటరీ అవార్డ్‌ను ఏర్పాటు చేశారు. ఎన్హెచ్ఎస్ సహా.. వ్యక్తిగతంగా పెద్దఎత్తున వైద్యసేవలు అందించిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు. ఎన్హెచ్ఎస్ జీవిత సాఫల్య పురస్కారం విభాగంలో షార్ట్‌లిస్ట్ అయిన ఏడుగురిలో డాక్టర్ ఘట్టమనేని హనుమంతరావు ఒకరు.
తెలుగు వ్యక్తే
కృష్ణా జిల్లా మొవ్వ గ్రామానికి చెందిన హనుమంతరావు.. కర్నూలులో వైద్య విద్య అభ్యసించారు. ఛండీగఢ్‌లో రేడియోథెరఫీ విభాగంలో ఎండీ పూర్తిచేశారు. ఆ తర్వాత మాంచెస్టర్‌లోని క్రిస్టీ ఆస్పత్రిలో శిక్షణ పొందారు. ప్రఖ్యాత కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రిస్టీ ఆస్పత్రిలో కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్‌గా పనిచేస్తూనే.. ఎఫ్ఆర్సీఆర్ పట్టా తీసుకున్నారు.
ఇదీ చదవండి: ప్రముఖ ప్రవాస భారతీయ ఫిజీషియన్ లోధా మృతి