ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగే ముందు బ్రెగ్జిట్‌కు ప్రతీకగా ఓ ప్రత్యేక నాణెం విడుదల చేసింది యూకే సర్కారు. శాంతి, శ్రేయస్సు, అన్ని దేశాలతో స్నేహం అనే సందేశంతో కూడిన '50 పెన్స్' విలువగల బ్రెగ్జిట్ స్మారక నాణేన్ని రూపొందించింది. బ్రెగ్జిట్ సందర్భంగా జనవరి 31 నుంచి 30లక్షలకు పైగా నాణేలు అన్ని బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది మొత్తం 70లక్షల నాణేలు చెలామణిలోకి రానున్నాయి.
ఈ కొత్త నాణెం దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ధీమా వ్యక్తం చేశారు బ్రిటన్ ఛాన్సులర్ సజిద్ జావిద్.
ఈ నాణేలను పొందటానికి ఇప్పటికే 13వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ ముద్రణ సంస్థ రాయల్ మింట్ తెలిపింది. 2019 అక్టోబర్ 31కి ముందే ఈ నాణేల తయారీకీ జావిద్ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత బ్రెగ్జిట్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందలేదు. ఫలితంగా ఆనాడే ముద్రించిన 10లక్షల నాణేలన్నింటినీ కరిగించి తాజాగా మరోసారి నూతన నాణేలను తయారు చేసింది ప్రభుత్వం.
ఇదీ చదవండి: విమానాలపై లేజర్‌లైట్... చివరికి అరెస్ట్!