కరోనా మహమ్మారి స్పెయిన్‌లో మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. కానీ వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల మొక్కవోని ధైర్యం, సేవాభావంతో పనిచేస్తున్నారు. అలాంటి వారికి ఘనంగా అభినందనలు తెలిపారు మాడ్రిడ్ ప్రజలు.
కరతాళ ధ్వనులతో...
శనివారం సాయంత్రం... మాడ్రిడ్‌లోని జిమెనెజ్ డియాజ్ ఫౌండేషన్ ఆసుపత్రి వెలుపల అంబులెన్స్ సైరన్ల మోత మోగిపోయింది. విద్యుత్ దీపాలు ధగధగలాడాయి. సమీప నివాస భవనాల్లోని ప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చారు. కరతాళ ధ్వనులు చేస్తూ... కరోనా బాధితులకు 24 గంటలూ అత్యవసర సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలను మనసారా అభినందనలు తెలిపారు.
మూడో స్థానంలో...
ఇప్పటి వరకు కరోనా ధాటికి అత్యంత నష్టపోయిన దేశాల్లో... స్పెయిన్ మూడో స్థానంలో ఉంది. శుక్రవారం ఒక్క రోజే అక్కడ దాదాపు 5000 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 25,000కు చేరింది. అలాగే శుక్రవారం ఒక్కరోజే 1,002 మందిని కరోనా కబళించగా, ఇప్పటి వరకు ఈ మహమ్మారి ధాటికి మరణించిన వారు సంఖ్య 1,326కు చేరుకుంది.
ఇదీ చూడండి: కరోనాను ఎదుర్కొందామని కిమ్‌కు ట్రంప్ లేఖ