boat capsized news:పెయిన్‌లోని అట్లాంటిక్ మహా సముద్రంలోని కానరీ ద్వీప సమూహానికి ఏడు పడవల్లో బయలుదేరిన దాదాపు 319 మంది వలసదారులను రక్షించినట్లు స్పెయిన్ అత్యవసర సేవల విభాగం అధికారులు పేర్కొన్నారు. వీరిలో 59 మంది మహిళలు, 24 మంది పిల్లలు ఉన్నట్లు తెలిపారు. మరో 18 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. అయితే ఆ పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎటువంటి మృతదేహం లభ్యం కాలేదని.. అక్కడ గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. వలసదారులంతా ఉత్తర, మధ్య ఆఫ్రికాకు చెందిన వారై ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
మానవ అక్రమ రవాణా ఉదంతంలో ఒక మృతదేహాం లభ్యం
ఫ్లోరిడా సముద్ర తీరంలో మానవ అక్రమ రవాణా ఉదంతానికి సంబంధించి ఓ పడవలో మృతదేహాన్ని గుర్తించినట్లు అమెరికా తీర రక్షక దళం పేర్కొంది. అయితే ఆ పడవలో ఉన్న ఇంకా 38 మంది ఆచూకీ లభ్యం కాలేదని.. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపింది. బహమాస్ నుంచి ఈ పడవ బయలుదేరిందని పేర్కొన్న అధికారులు అందులో ఒకరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఆ పడవ నుంచి తప్పించుకున్న మిగతా వారిని ఎలాగైనా పట్టుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 90ఏళ్ల వయసున్న ఈ చేప గురించి తెలుసా..?