ETV Bharat / international

కరోనా టైంలో 'మాస్కే​' శ్రీరామ రక్ష.. ఇదిగో సాక్ష్యం - sneeze shows

కరోనా కాలంలో ప్రధాన ఆయుధం.. మాస్క్​. వైరస్​ బారిన పడకుండా ఉండాలంటే దీన్ని తప్పనిసరిగా ధరించాల్సిందే. కానీ, కొంతమంది ఈ మాట వినిపించుకోవటం లేదు. ముఖానికి తొడుగు లేకపోయినా మాకేం కాదనే భ్రమలో ఉంటున్నారు. అలాంటి వారిలో మార్పు తేవడం కోసం 'స్లో మో గయ్స్'​ ముందుకొచ్చారు. ఇంతకీ వాళ్లేం చేశారంటే..

Slow-motion video of a sneeze shows the importance of wearing a face mask
కరోనా టైంలో 'మాస్కే' శ్రీరామ రక్ష.. ఇదిగో సాక్ష్యం
author img

By

Published : Oct 23, 2020, 8:25 PM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ విజృంభణ కొనసాగుతూనే ఉంది. వ్యాక్సిన్​ ఇప్పట్లో వచ్చేలా లేదు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు.. ముందు జాగ్రత్త చర్యగా మాస్క్​ ధరించాలని చెబుతున్నారు వైద్యులు. కానీ, చాలా మంది నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు మీకెవరైనా కనిపిస్తే, వారికి ఈ వీడియో ఒక్కసారి చూపించండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చాలా స్పష్టంగా..

దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు వైరస్​ అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా వీడియో ద్వారా చూపించింది ఇంగ్లాండ్​కు చెందిన 'స్లో మో గయ్స్​' అనే బృందం. ఓ వ్యక్తి గట్టిగా మాట్లాడుతున్నప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు.. 1000 ఫ్రేమ్స్​ పర్​ సెకండ్స్​(ఎఫ్​పీఎస్​) ద్వారా స్లో మోషన్​ వీడియోను చిత్రీకరించారు. వైరస్​ కణాలు ఏ విధంగా పయనిస్తాయో ఇందులో స్పష్టంగా చూపించారు. 'గావ్'​ అనే వ్యక్తి ఈ ప్రయోగం చేశాడు.

పాటించాల్సిందే..

గ్రాఫికల్​గా చాలా చక్కగా చూపించారని ఈ వీడియోను అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ ప్రశంసించారు. కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ జాగ్రత్తలు పాటించకోపోతే, ఇతరులకు వైరస్​ సోకుతుందని హెచ్చరించారు.

వైరస్​ సోకిన వ్యక్తి మాస్క్​ ధరించకుండా గట్టిగా మాట్లాడినా, నెమ్మదిగా మాట్లాడినా.. కణాలు ఒకే స్థాయిలో వ్యాపిస్తాయని ఈ వీడియోలో తేలింది. 'థారక్స్' అనే మెడికల్​ జర్నల్​ ​ఇలాంటి ఓ వీడియోను జులైలో పబ్లిష్​ చేసింది.

ఇదీ చూడండి:ఫ్రాన్స్​లో కరోనా 2.0.​- రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.