ETV Bharat / international

ప్లాస్టిక్​ భూతంపై యుద్ధం- సరికొత్తగా, వినూత్నంగా - కొవిడ్ సమయంలో పెరిగిన ప్లాస్టిక్ వినియోగం

ప్లాస్టిక్‌ కాలుష్యం సర్వత్రా విస్తరించి భూమిని విషతుల్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను వదిలించుకోవడం మానవాళికి ఓ పెను సమస్యగా మారింది. దీనికి శాస్త్రవేత్తల ఆవిష్కరణలు కాసింత ఊరటనిస్తున్నాయి. 2020లో ప్లాస్టిక్ పునర్వినియోగంపై జరిగిన పరిశోధనలు మంచి ఫలితాలు సాధించడం భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తున్నాయి.

Scientists working on plastic-eating enzymes that could be used in recycling found a way to make the process faster
ప్లాస్టిక్​ను తినే 'సూపర్​ ఎంజైమ్​' ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు
author img

By

Published : Dec 27, 2020, 2:06 PM IST

ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను పునర్‌ వినియోగించేందుకు శాస్త్రవేత్తలు ఈ ఏడాది అద్భుతమైన ఆవిష్కరణలు జరిపారు. అయితే వీటన్నింటిని కరోనా విపత్తు ప్రశ్నార్థకంగా మిగిల్చింది. కరోనా వైరస్‌ ముప్పుతో... ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వస్తువులకు పెద్దఎత్తున డిమాండ్ పెరిగింది. వ్యక్తిగత రక్షణ సూట్లు, ఫేస్‌ షీల్డ్‌లు, మాస్కులు ఇలా కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించే వస్తువులన్నీ సింగిల్ యూజ్‌ ప్లాస్టిక్‌తోనే తయారవుతున్నాయి. కరోనా పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ప్లాస్టిక్‌ భూతానికి కోరలు తొడిగినట్లేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ప్లాస్టిక్​ భూతం అంతానికి సూపర్ ఎంజైమ్..

జనాభాతో పాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలూ పెరుగుతున్నాయి. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌, సోడా క్యాన్లు, వాటర్‌ బాటిళ్లు పర్వతాల్లా పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్‌ కాలుష్యం సర్వత్రా విస్తరించింది. ప్లాస్టిక్‌లోని రసాయనాలు గాలిని, నీటిని, భూమిని విషతుల్యం చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలను వదిలించుకోవడం మానవాళికి ఓ పెను సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో...శాస్త్రవేత్తల ఆవిష్కరణలు కాసింత ఊరటనిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను తినే ఎంజైమ్‌లపై పరిశోధనలను శాస్త్రవేత్తలు వేగవంతం చేశారు. బ్రిటన్‌, అమెరికా శాస్త్రవేత్తలు పాలిథిలిన్ టెరాఫ్తలెట్ పీఈటీ, మోనో -2-హైడ్రాక్సి ఇథైల్ టెరెఫ్తాలేట్ ఎమ్​హెచ్​ఈటీ ఎంజైమ్‌లను కలిపి శక్తిమంతమైన 'సూపర్ ఎంజైమ్'ను సృష్టించారు.

Scientists working on plastic-eating enzymes that could be used in recycling found a way to make the process faster
పెరుగుతోన్న ప్లాస్టిక్​ వాడకం

ఇదివరకు ప్లాస్టిక్‌ వ్యర్థాలను నాశనం చేయాలంచే పీఈటీ ఎంజైమ్‌ను ఉయోగించేవారు కానీ ఈ సూపర్ ఎంజైమ్‌ రాకతో ప్లాస్టిక్‌ వ్యర్థాలను పీఈటీ కంటే 6 రెట్లు వేగంగా విచ్ఛిన్నం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వాషింగ్‌ మిషన్‌లు పనిచేసే క్రమంలో అతిసూక్ష్మమైన దారపు పోగులను విడుదల చేస్తాయని బ్రిటన్ పరిశోధకులు తెలిపారు. ఏడాదిలో ఈవిధంగా దాదాపు ఏడు లక్షల సూక్ష్మపోగులు మురికి నీటి ద్వారా జలాశయాల్లో కలుస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా రోజూ మనం ఉపయోగించే వాహనాల వల్ల కూడా ప్లాస్టిక్‌ ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

వాషింగ్​ మెషిన్​ నుంచి విడుదలయ్యే అతిసూక్ష్మ దారపు పోగులు

రోడ్లపై వాహనాలు వెళ్లే క్రమంలో...టైర్లు అరిగి హానికరమైన దూళి కణాలు గాలిలోకి వ్యాపిస్తున్నాయని నిపుణులు హెచ్చరించారు. వీటి పరిమాణం 2.5 పీఎమ్ ఉంటుందని వివరించారు. ఈ ప్రక్రియను ఓ ప్రోటోటైప్‌ పరికరం ద్వారా పరిశోధకులు నిరూపించారు. ఈ హానికర మసికణాల వల్ల ఏటా లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్నారని ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని పరిశోధకులు వివరించారు.

టైర్ల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు

"టైర్లకు రహదారి మధ్య ఘర్షణ తలెత్తి ధనాత్మక సూక్ష్మకణాలు గాల్లోకి ఎగురుతున్నట్లు మేము కనుగొన్నాం. తిరుగుతున్న చక్రం చుట్టూ ఎలెక్ట్రోస్టాటిక్స్ ఉపయోగించి ఈ సూక్ష్మ రేణువులను సేకరించాం".

-సియోభన్ ఆండర్సన్, పరిశోధకురాలు

కొవిడ్‌ రాకతో ప్లాస్టిక్‌ వినియోగం మరింత శ్రుతిమించింది. మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యక్తిగత రక్షణ సామగ్రి, మాస్కులు, శానిటైజర్‌ బాటిళ్లు వాడాల్సి వస్తోంది. ఇవన్నీ కలిపితే తయారయ్యే వ్యర్థం అంతా ఇంతా కాదు.

2018 ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం... వాడిపడేసిన పీపీఈ కిట్‌లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు దాదాపు 13 మిలియన్లు ఏటా సముద్రంలో కలుస్తున్నాయి. కరోనా మహమ్మారి వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువైందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అందుకే వస్త్రంతో చేసిన మాస్కులు, త్వరగా విచ్ఛిన్నం అయ్యే పదార్థాల ద్వారా తయారయ్యే మాస్కుల వాడకాన్ని శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు.

కొంత మంది పరిశోధకులు పర్యావరణహితమైన చెట్ల రసం నుంచి కరోనా రక్షణ కవచాలు తయారు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా వారానికి 10 లక్షల పర్యావరణ హితమైన రక్షణ తెరలను ఉత్పత్తి చేస్తున్నట్లు రీల్‌బ్రాండ్‌ సహ వ్యవస్థాపకుడు ఇయాన్‌ బెట్స్‌ తెలిపారు.

"ఇది పూర్తిగా విచ్ఛిన్నం అయ్యే స్థిరమైన పదార్థంతో తయారైంది. దీనిలో విజర్, పారదర్శక భాగం చెక్క గుజ్జుతో తయారైంది, చెట్ల నుంచి తయారవుతుందన్న విషయం ఎవరికి నమ్మశక్యం కాదు. అయితే ఇది నిజం. ఇది కార్డ్‌బోర్డుతో నిర్మితమైంది".

- ఇయాన్‌ బెట్స్‌, రీల్‌ బ్రాండ్ సహ వ్యవస్థాపకుడు

ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా...

హాంకాంగ్‌లోని కొంతమంది పరిశోధకులు వాడిపడేసిన ప్లాస్టిక్‌ వస్తువులను సమర్థంగా ఉపయోగిస్తున్నారు. కరోనా ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఫాగ్‌ అనే పరిశోధక విద్యార్థి ఇంట్లోని వ్యర్థపదార్థాలను మాస్కులుగా, కళ్ల అద్దాలుగా తయారు చేశాడు. పాల డబ్బాల నుంచి సేకరించిన కాగితాన్ని మాస్కులుగా, సాండ్‌విచ్‌ పెట్టెలను కళ్లజోడుగా మార్చాడు.

వాడేసిన ప్లాస్టిక్​తో ఫేస్​ మాస్క్ చసిన యువకుడు

మధ్య ఆఫ్రికా దేశమైన కామెరూన్‌లోని మత్స్యకారులు... వాడిపడేసిన ప్లాస్టిక్‌ను ఉపాధి సాధనంగా మార్చుకుంటున్నారు. బీచ్‌లు, పట్టాణ ప్రాంతాల నుంచి సేకరించిన ప్లాస్టిక్ బాటిళ్లతో పడవలు తయారు చేస్తున్నారు. ఈ నాటు పడవలతోనే సముద్రాలు, నదుల్లో చేపల వేట కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. కామెరూన్‌ వాతావరణ విభాగం ప్రకారం ఏటా అక్కడ 6 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా.

ప్లాస్టిక్​ బాటిళ్లతో పడవలు తయారు చేస్తోన్న ఆఫ్రికా వాసులు

బెల్జియంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఆకర్షణీయమైన అలంకార వస్తువులుగా ఆ దేశ వృత్తి నిపుణులు మార్చుతున్నారు. మాథిల్డే రూలెన్స్ అనే ఫ్యాషన్ డిజైనర్‌....వాడిపడేసిన ప్లాస్టిక్‌ వస్తువులను ఒక దగ్గర చేర్చి ఉపకరణాలుగా తయారు చేస్తున్నారు. చెవిరింగులు, దీపాలు, పెయింటింగ్‌లు, కీచైన్స్, పెద్దపెద్ద ప్లాస్టిక్‌ పాత్రలను ఉత్పత్తి చేస్తున్నారు.

వాడేసిన ప్లాస్టిక్​తో అలంకార వస్తువుల తయారీ

ప్లాస్టిక్‌ పునర్వినియోగాన్ని రష్యాకు చెందిన ఒక యువతి వ్యాపారంగా మలచుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నగలు, ఇతర ఆలంకరణ వస్తువులు తయారు చేస్తోంది. వీటితో పాటు క్రిస్మస్‌ ట్రీ, గ్రీటింగ్ కార్డులు, వార్పింగ్ పేపర్లు, శాంటాక్లాజ్‌ కీచైన్లను అందంగా మార్చింది.

కీచైన్లుగా తయారు చేసి

గత్యంతరం లేని పరిస్థితుల్లోనే మనం చేపడుతున్న కరోనా జాగ్రత్త చర్యల వల్ల ప్లాస్టిక్‌ వినియోగం అధికం కావడం స్వల్పకాలికమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మహమ్మారి ఫలితంగా ప్లాస్టిక్‌ కాలుష్య అంశం అటకెక్కుతోందన్న ఆందోళన పర్యావరణవేత్తల్లో వ్యక్తమవుతున్నప్పటికీ...కరోనా కంటే ముందు నుంచే అనేక దేశాలు వివిధ రకాలుగా ప్లాస్టిక్‌ కాలుష్యంపై పోరు సలపడం ఆనందం కలిగిస్తున్నాయి. 2020లో ప్లాస్టిక్ పునర్‌ వినియోగంపై జరిగిన పరిశోధనలు మంచి ఫలితాలు సాధించడం భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తున్నాయి.

ఇదీ చదవండి:పాక్ ఆర్మీ హెలికాప్టర్​ కూలి నలుగురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.