ఎన్నో అవార్డులను గెలుచుకున్న భారత ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మరో అవార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ప్రతిష్టాత్మక 'ఇటాలియన్ గోల్డెన్ సాండ్ ఆర్ట్' అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత వ్యక్తిగా చరిత్ర సృష్టించారు పట్నాయక్. రోమ్ నగరంలో ఈ వేడుక జరిగింది.
నవంబర్ 13 నుంచి 17 వరకు జరుగుతున్న ప్రముఖ 'ఇంటర్నేషనల్ స్కోరానో సాండ్ నేటివిటీ' కార్యక్రమంలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు పట్నాయక్. రష్యా కళాకారుడు పావెల్ మినిల్కోవ్తో కలిసి 10 అడుగుల ఎత్తయిన మహత్మ గాంధీ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ శిల్పానికిగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.
-
I have received the Italian Golden Sand Art Award 2019 by Mr. Vito Maraschio the president of Promuovi International Scorrano Sand Nativity at a ceremony in Rome , Italy pic.twitter.com/w8v4sMSjvB
— Sudarsan Pattnaik (@sudarsansand) November 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I have received the Italian Golden Sand Art Award 2019 by Mr. Vito Maraschio the president of Promuovi International Scorrano Sand Nativity at a ceremony in Rome , Italy pic.twitter.com/w8v4sMSjvB
— Sudarsan Pattnaik (@sudarsansand) November 16, 2019I have received the Italian Golden Sand Art Award 2019 by Mr. Vito Maraschio the president of Promuovi International Scorrano Sand Nativity at a ceremony in Rome , Italy pic.twitter.com/w8v4sMSjvB
— Sudarsan Pattnaik (@sudarsansand) November 16, 2019
రోమ్ నగరంలో జరిగిన 'ఇంటర్నేషనల్ స్కోరానో సాండ్ నేటివిటీ' కార్యక్రమంలో ప్రతిష్టాత్మకమైన ఇటాలియన్ గోల్డెన్ సాండ్ అవార్డును స్వీకరించాను. ఈ అవార్డు దక్కినందుకు చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది. ఈ కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ నిహారిక సింగ్ పాల్గొన్నారు.
- సుదర్శన్ పట్నాయక్ ట్వీట్.
పట్నాయక్ ఇప్పటి వరకు 60 అంతర్జాతీయ సైకత పోటీలు, ఛాంపియన్‌షిప్‌లలో భారత తరఫున పాల్గొని అనేక బహుమతులను పొందారు. ఇటాలియన్ గోల్డెన్ అవార్డు గెల్చుకున్నందుకు పట్నాయక్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి:కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ 'భారత్ బచావో'