రష్యాలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 619 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది డిసెంబర్ 24 తర్వాత ఒక్కరోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కరోనా మరణాల సంఖ్య ఇదే. కొత్తగా 21,665 మంది వైరస్ బారినపడ్డారు. ఈ నెల 1వ తేదీ 9వేల 500 రోజువారీ కరోనా కేసులు నమోదుకాగా ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది.
రష్యా నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో మూడో వంతు మాస్కోలోనే ఉన్నాయి. రెస్టారెంట్లు, బార్లలోకి టీకా వేసుకున్న వారిని, ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. రష్యా జనాభా 14 కోట్ల 60 లక్షల మంది కాగా వారిలో 14 శాతం అంటే 2 కోట్ల 10 లక్షల మంది కనీసం ఒక డోసు టీకా తీసుకున్నారు.
ఇదీ చూడండి: 'టీకా తీసుకోనివారిలోనే డెల్టా రకం వేగంగా వ్యాప్తి'
ఇదీ చూడండి: డెల్టా భయంతో ఆ దేశాల్లో మళ్లీ ఆంక్షలు!