Indian students in Sumy: ఉక్రెయిన్లోని సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారత విద్యార్థులకు ఊరట లభించింది. ఆ విద్యార్థుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. వీరందరూ సుమీ నుంచి బస్సులలో బయల్దేరారు. ఈ విషయాన్ని విద్యార్థులను సమన్వయం చేస్తున్న అన్షద్ అలీ అనే వ్యక్తి వెల్లడించారు.
Indians evacuation Ukraine
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సుమీలో చిక్కుకుపోయిన విద్యార్థులు పోల్టావాకు వెళ్తున్నట్లు వెల్లడించారు. కంట్రోల్ రూమ్ నుంచి సోమవారం రాత్రి అందిన సమాచారం ప్రకారం 694 మంది విద్యార్థులు సుమీలో ఉన్నట్లు తెలిపారు. వీరంతా బస్సుల్లో బయలుదేరారని చెప్పారు.
Russia Ukraine War
పౌరుల తరలింపు అంశానికి భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఈ విషయంపైనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సోమవారం ఉక్రెయిన్, రష్యా దేశాధినేతలతో మాట్లాడారు. భారతీయుల తరలింపునకు సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
ఇప్పటివరకు భారత్ 17,100 మంది పౌరులను స్వదేశానికి తీసుకొచ్చింది.
ఇదీ చదవండి: ఉక్రెయిన్లో బాంబుల మోత.. రష్యా దాడుల్లో 10 మంది మృతి