ETV Bharat / international

ఫలిస్తున్న 'ఆర్థిక అస్త్రం'... రష్యా బ్యాంకింగ్ వ్యవస్థ కుదేలు - Belarus US Embassy close

Russia Ukraine war: రష్యాపై అంతర్జాతీయ సమాజం విధించిన ఆర్థిక ఆంక్షలు ఫలితాన్ని ఇస్తున్నాయి. స్విఫ్ట్ వ్యవస్థ నుంచి రష్యాను బహిష్కరించడం సహా పలు నిర్ణయాలు రష్యాలోని బ్యాంకింగ్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. రష్యా కరెన్సీ అయిన రూబుల్ తీవ్రంగా పతనమైంది.

RUSSIA UKRAINE SANCTIONS
RUSSIA UKRAINE SANCTIONS
author img

By

Published : Feb 28, 2022, 8:34 PM IST

Russia Ukraine war: రూబుల్ పతనం... బ్యాంకింగ్ వ్యవస్థ కుదేలు... నగదు విత్​డ్రా చేసుకునేందుకు జనం బారులు... ఒత్తిడితో మూతపడుతున్న బ్యాంకులు... ధరలు పెరుగుదల... ఉక్రెయిన్​పై దండెత్తి అంతర్జాతీయ ఆంక్షలకు బలవుతున్న రష్యాలో తాజా పరిస్థితులివి. 'స్విఫ్ట్' వ్యవస్థ నుంచి బహిష్కరించాలన్న అమెరికా సహా పలు దేశాల నిర్ణయం.. రష్యాను తీవ్రంగానే దెబ్బ కొడుతోంది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం పెట్టుకున్న లక్ష్యం నెరవేరుతున్నట్లే కనిపిస్తోంది.

Russia sanctions SWIFT

ఓవైపు ఉక్రెయిన్​తో యుద్ధం, మరోవైపు ఆంక్షలు.. వెరసి ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందన్న భయాలతో రష్యా ప్రజలు బ్యాంకులలో దాచుకున్న సొమ్మును విత్​డ్రా చేసుకునేందుకు ఎగబడుతున్నారు. వేలాది మంది రష్యన్లు ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. భారీ స్థాయిలో డిపాజిట్లను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో బ్యాంకులు రుణాలు చెల్లించలేకపోతున్నాయి. సోబర్​బ్యాంక్, వీటీబీ బ్యాంకులు పతనం అంచులో ఉన్నాయని యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు పేర్కొంది. రష్యా బ్యాంకింగ్ వ్యవస్థలో సగానికి పైగా ఆస్తులు.. ప్రభుత్వ అధీనంలోని ఈ రెండు బ్యాంకులవే కావడం, ఈ బ్యాంకులే ఆంక్షలతో కొట్టుమిట్టాడుతుండటం.. అక్కడి దుర్భర పరిస్థితిని సూచిస్తోంది.

RUSSIA UKRAINE SANCTIONS
ఏటీఎంల ముందు రష్యన్లు

బ్యాంకుల మూసివేత...

క్రొయేషియాలో రోజుకు వెయ్యి యూరోలకు మించి నగదు ఉపసంహరించుకునే వీలు లేకుండా సోబర్​బ్యాంక్ నిబంధనలు విధించాయి.. స్లొవేనియాలో రానున్న రెండు రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఆ తర్వాత రోజుకు 400 యూరోలు మాత్రమే డ్రా చేసుకునే వీలుంటుంది.

కరెన్సీ పతనం...

Russian Ruble vs Dollar: ఇక స్విఫ్ట్​ నుంచి రష్యా బహిష్కరణతో.. ఆ దేశ కరెన్సీ రూబుల్​పై తీవ్ర ప్రభావం పడింది. సోమవారం రూబుల్ అమెరికా డాలరుతో పోలిస్తే 30 శాతం వరకు పతనమైంది. ఓ దశలో డాలరుకు రూబుల్ మారకం విలువ 105.27కు పడిపోయింది. ఒక్క రూబుల్.. అమెరికా సెంట్​(డాలరులో వందో వంతు) కన్నా తక్కువగా ట్రేడ్ అయింది. ఇది డాలరు-రూబుల్ చరిత్రలోనే అత్యంత కనిష్ఠ స్థాయి అని విశ్లేషకులు చెబుతున్నారు. సోవియట్ పతనం తర్వాత రష్యాలో తలెత్తిన కరెన్సీ సంక్షోభం ఇదేనని చెప్పారు.

అయితే, రష్యా సెంట్రల్ బ్యాంకు వెంటనే అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బ్యాంకుల కీలక వడ్డీ రేటును 9.5 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. ఈ నిర్ణయంతో.. రూబుల్ మారకం విలువ 98.22కు పుంజుకుంది.

కరెన్సీ పతనంతో సంక్షోభమే..

Russia currency crisis: రూబుల్ పతనంతో రష్యా సగటు జీవన ప్రమాణాలు తగ్గుతాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 'దిగుమతి చేసుకునే వస్తువులపై రష్యన్లు ఆధారపడుతున్నారు. వాటి ధరలకు రెక్కలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు మరింత ప్రియం అవుతాయి. రానున్న కొద్దివారాల్లో ఆర్థిక వ్యవస్థ మరింత కుంగుబాటుకు గురవుతుంది. సప్లై చైన్ వ్యవస్థ దెబ్బ తింటుంది. డిమాండ్ పడిపోవడం వల్ల ఫ్యాక్టరీలు మూతపడతాయి. మొత్తంగా రష్యా ఆర్థిక వ్యవస్థ వేగంగా కుప్పకూలుతుంది' అని వర్జీనియా ఆర్థికవేత్త ప్రొఫెసర్ డేవిడ్ ఫెల్డ్​మన్ చెప్పారు. 'భారీగా సబ్సిడీలు ఇస్తే తప్ప ఈ పరిణామాలను ఎదుర్కోవడం కష్టం. ఇండస్ట్రీలు, బ్యాంకులు, ఆర్థిక వ్యవస్థను రష్యా ప్రభుత్వం ఆదుకోవాలి. డాలర్, యూరో వంటి ప్రామాణిక కరెన్సీలు లేకుండా సబ్సిడీలు ఇవ్వడం కుదరదు. కాబట్టి రష్యా సొంత కరెన్సీని భారీ ఎత్తున ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం రాకెట్ వేగంతో పెరుగుతుంది' అని ఫెల్డ్​మన్ వివరించారు.

అమెరికా కొత్త ఆంక్షలు

US Treasury sanctions Russia: మరోవైపు, అమెరికా ట్రెజరీ శాఖ రష్యా సెంట్రల్ బ్యాంకు లక్ష్యంగా కొత్త ఆంక్షలు విధించింది. ఆ దేశ ప్రభుత్వ పెట్టుబడుల నిధులపైనా ఆంక్షలు ప్రకటించింది. అమెరికాలో రష్యా సెంట్రల్ బ్యాంకుకు ఉన్న ఆస్తులు, అమెరికన్ల వద్ద ఉన్న రష్యా సెంట్రల్ బ్యాంకు ఆస్తులపై నిషేధం అమలవుతుంది. ఉక్రెయిన్​ దురాక్రమణ సహా ఇతర అస్థిర పరిచే కార్యకలాపాలకు నిధులు మళ్లించడం రష్యాకు కష్టమవుతుంది. అమెరికా దారిలోనే ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఇటలీ, జపాన్, ఈయూ దేశాలు పయనిస్తాయని శ్వేతసౌధ అధికారులు భావిస్తున్నారు. రష్యా లాంటి పెద్ద దేశంపై అమెరికా ట్రెజరీ తీసుకున్న అత్యంత కఠినమైన చర్యలు ఇవేనని చెప్పారు.

బెలారస్ ఎంబసీ మూసివేత

Belarus US Embassy close: దౌత్యపరంగానూ అమెరికా కఠిన వైఖరి కొనసాగిస్తోంది. ఉక్రెయిన్​తో యుద్ధంలో రష్యాకు సహకరిస్తున్న బెలారస్​లోని రాయబార కార్యాలయాన్ని మూసేసింది. మిన్స్​క్(బెలారస్ రాజధాని)లో అన్ని కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ తెలిపారు. రష్యాలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఉన్న అదనపు సిబ్బంది తిరిగి రావాలని ఆదేశించారు.

ఆంక్షల బాటలో అమెరికాలోని రాష్ట్రాలు

అదేసమయంలో, అమెరికాలోని పలు రాష్ట్రాలు స్వతంత్రంగా రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యా ముడి పదార్థాల నుంచి తయారైన ఉత్పత్తులను మద్యం స్టోర్ల నుంచి తొలగించాలని లిక్కర్ కంట్రోల్ బోర్డును పెన్సిల్వేనియా గవర్నర్ టామ్ వోల్ఫ్ ఆదేశించారు. వెంటనే ఆ ఉత్పత్తుల విక్రయాలు ఆపేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా రష్యా ఉత్పత్తులను స్టోర్ల నుంచి తొలగిస్తున్నట్లు బోర్డు ప్రకటన జారీ చేసింది.

RUSSIA UKRAINE SANCTIONS
ఉక్రెయిన్​కు సాయం చేయాలని అమెరికాలో ప్రదర్శన

రష్యా ప్రభుత్వ సంస్థలతో ఉన్న కాంట్రాక్టుల వివరాలను గుర్తించాలని కొలరాడో గవర్నర్ జేరడ్ పొలిస్.. ఐటీ, సిబ్బంది శాఖ అధికారులను ఆదేశించారు. ఏవైనా కాంట్రాక్టులు ఉన్నట్లు తేలితే వెంటనే రద్దు చేయాలని స్పష్టం చేశారు. వర్జీనియా, ఓహాయో, యూటా, టెక్సస్, న్యూహాంప్​షైర్ రాష్ట్రాల గవర్నర్లు సైతం ఈ తరహా నిర్ణయాలు తీసుకున్నారు.

పర్యటన రద్దు...

రష్యా విమానాలపై ఐరోపా సమాఖ్య విధించిన నిషేధ ప్రభావం ఆ దేశ విదేశాంగ మంత్రిపై ప్రత్యక్షంగా పడింది. జెనీవాలోని ఐరాస ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సిన రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్.. తన పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

అయితే, గగనతలంలోకి రష్యా విమానాలు రాకుండా పలు దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో రష్యా సైతం అదే తరహా ఆంక్షలు అమలులోకి తెచ్చింది. బ్రిటన్, జర్మనీ సహా 36 దేశాల ఎయిర్​లైన్లపై నిషేధం విధించింది.

RUSSIA UKRAINE SANCTIONS
ఉక్రెయిన్​ కోసం ప్రార్థిస్తూ..

ఉక్రెయిన్​కు నాటో దేశాల సాయం

రష్యా సేనలను ప్రతిఘటిస్తూ వీరోచితంగా పోరాడుతున్న ఉక్రెయిన్​కు సాయం చేసేందుకు నాటో సభ్య దేశాలు ముందుకొస్తున్నాయి. గగనతల రక్షణ క్షిపణులు, ట్యాంకు విధ్వంసక ఆయుధాలను అందించాలని సభ్య దేశాలు నిర్ణయించాయని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్​బర్గ్ తెలిపారు. ఆర్థిక, మానవతా సహాయాన్ని సైతం అందించనున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: ఆంక్షల సెగ.. రికార్డు స్థాయిలో పతనమైన రష్యా కరెన్సీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.