Russia Ukraine tensions: ఉక్రెయిన్‌పై దాడి చేసే ఉద్దేశంలేదని, బలగాలను వెనక్కి రప్పిస్తున్నామని రష్యా పదేపదే చెబుతున్నప్పటికీ అమెరికా నమ్మడం లేదు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో భారీగా రష్యా సైన్యం ఉందని, ఏదో ఒక సాకుతో ఏ క్షణమైనా దాడులకు దిగే అవకాశముందని అగ్రరాజ్యం ఆరోపిస్తోంది.
Russia Ukraine war
గతంలోనూ ఇలాంటి పరిస్థితులను తాము చూశామని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం అధికార ప్రతినిధి జెన్ సాకి వెల్లడించారు. రెచ్చగొట్టే ప్రకటనలు, తప్పుడు వీడియోలు, రసాయన ఆయుధాలు ఉన్నాయనే సాకులతో ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగవచ్చని ఆమె వివరించారు. ఈ నేపథ్యంలో వివిధ భాగస్వామ్య దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.
Ukraine Russia border soldiers
"ఉక్రెయిన్‌పై రష్యా అధికారిక మీడియా వివిధ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. దాడి జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఐరోపాలోని మిత్రదేశాలు, భాగస్వామ్య దేశాలతో చర్చించి ఉక్రెయిన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత కాపాడతాం. ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు జర్మనీలోని మ్యూనిచ్‌లో భద్రతా సదస్సు జరుగుతుంది. దీనికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెళతారు."
-జెన్ సాకి, అమెరికా శ్వేతసౌధ అధికార ప్రతినిధి
ఈ విషయంలో భారత్.. తమకే మద్దతిస్తుందని ఆమెరికా భావిస్తోంది. అంతర్జాతీయ నియమాలకు కట్టుబడి ఉండే భారత్.. ఉక్రెయిన్- రష్యా యుద్ధం విషయంలో తమ వెంటే ఉంటుందని బైడెన్ యంత్రాంగం అంచనా వేస్తోంది.
![RUSSIA UKRAINE TENSIONS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14490481_1000-2.jpeg)
![RUSSIA UKRAINE TENSIONS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14490481_1000-3.jpeg)
సరిహద్దుకు ఏడు వేల బలగాలు
Russia army at Ukraine border: ఉక్రెయిన్ సరిహద్దులకు మరో ఏడు వేల బగాలను రష్యా తరలించిందని అమెరికా పేర్కొంది. ఇప్పటికే అక్కడ లక్షన్నర సైనికులు ఉన్నట్లు తెలిపింది. అయితే, రష్యా మాత్రం అమెరికా ఆరోపణలను తోసిపుచ్చింది. ఉక్రెయిన్ నుంచి బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇందుకు ఆధారంగా క్రిమియా నుంచి ఆయుధాలతో కూడిన రైలు రష్యాకు తరలిపోతున్న వీడియోను ప్రదర్శించింది. ట్యాంకులు,ఆయుధాలు రైళ్ల ద్వారా వెనక్కి మరలిస్తున్నట్లు పుతిన్ సర్కార్ ప్రకటించింది.
![RUSSIA UKRAINE TENSIONS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14490481_1000-5.jpeg)
అమెరికాతో పాటు నాటో కూడా రష్యా ప్రకటనను విశ్వసించడం లేదు. రష్యా సైన్యాన్ని ఉపసంహరించినట్లు ఎక్కడ ఆనవాళ్లులేవని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బెర్గ్ చెప్పారు. తూర్పు ఐరోపా దేశాల్లో మోహరించిన నాటో బలగాలకు సహకరించేందుకు కెంటకీలోని ఫోర్ట్ కేంప్‌బెల్ ఎయిర్‌బోర్న్ డివిజన్ బలగాలను అమెరికా తరలించింది. ఇప్పటికే అక్కడ ఉన్న అమెరికా సహా నాటో బలగాలకు అవి తోడ్పాటును అందిస్తాయని పేర్కొంది.
![RUSSIA UKRAINE TENSIONS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14490481_1000-4.jpeg)
వాటి స్థానంలో భర్తీ..
రష్యా తమ సైన్యాన్ని ఉపసహరించడంలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ సైతం ఆరోపించారు. కొన్ని బలగాలను వెనక్కి రప్పించి.. వాటి స్థానంలో వేరే బలగాలను భర్తీ చేస్తోందని పేర్కొన్నారు.
![RUSSIA UKRAINE TENSIONS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14490481_1000-1.jpeg)
రష్యా దాడి చేస్తే తమ పౌరులను రక్షించుకునేందుకు ఉక్రెయిన్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో పౌరులకు ఆయుధ శిక్షణ ఇస్తున్న ఉక్రెయిన్ పాలకులు... రష్యా బాంబు దాడులు చేస్తే కాపాడేందుకు ప్రత్యేక నిర్మాణాలు చేపట్టింది. కీవ్‌లో దాదాపు 5 వేల బాంబు షెల్టర్లను నిర్మించింది.
ఇదీ చదవండి: