ETV Bharat / international

'ఉక్రెయిన్​లో బందీలుగా భారతీయులు!'.. నిజమెంత? - Indian in Ukriane

Russia Ukraine crisis: ఉక్రెయిన్​లోని ఖార్కివ్‌ నగరం నుంచి భారతీయులు వెళ్లిపోకుండా ఉక్రెయిన్‌ యంత్రాంగం అడ్డుకుంటోందని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది. భారతీయులను ఉక్రెయిన్‌ సైనికులు మానవ రక్షణ కవచాలుగా ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. తమ భూభాగం ద్వారా భారతీయులను స్వదేశం పంపేందుకు సిద్ధమని రష్యా వెల్లడించింది. అయితే.. భారతీయ విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న వార్తల్ని భారత్ ఖండించింది.

Russia Ukriane
Russia Ukriane
author img

By

Published : Mar 3, 2022, 7:22 AM IST

Updated : Mar 3, 2022, 11:19 AM IST

Russia Ukraine crisis: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌ నగరంలో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు తమ సాయుధ బలగాలు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తమ భూభాగం ద్వారా భారత పౌరులను స్వదేశం పంపేందుకు సిద్ధమని రష్యా తెలిపింది. ఖార్కివ్‌ నగరం నుంచి భారతీయులు వెళ్లిపోకుండా ఉక్రెయిన్‌ యంత్రాంగం అడ్డుకుంటోందని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది. భారతీయులను ఉక్రెయిన్‌ సైనికులు మానవ రక్షణ కవచాలుగా ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.

అయితే భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా ఈ ఆరోపణలను ఖండించారు. రక్తమోడుతూ కూడా ఉక్రెయిన్​.. విదేశీ పౌరులు దేశం దాటేందుకు సహకరిస్తోందని చెప్పారు. తనకు తెలిసి భారతీయులు ఖార్కివ్‌ నగరాన్ని ఖాళీ చేసి పశ్చిమ సరిహద్దులకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. భారత్ సహా విదేశీ విద్యార్థుల కోసం హాట్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు.. ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ తెలిపింది.

అలాంటిదేం లేదు..

ఉక్రెయిన్​లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న వార్తలపై విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. అలాంటిదేమీ లేదని, ఉక్రెయిన్‌లోని ఎంబసీ భారతీయ పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని స్పష్టం చేసింది. ఉక్రేనియన్ అధికారుల సహకారంతో చాలా మంది విద్యార్థులు బుధవారం ఖార్కివ్ నుంచి బయలుదేరారని చెప్పింది. ఈ విషయంలో తోడ్పాటు అందిస్తున్నందుకు ఉక్రెయిన్ అధికారులు, సరిహద్దు దేశాలకు ధన్యవాదాలు తెలిపింది.

ఇదీ చూడండి: 200 మంది పౌరులతో భారత్​ చేరుకున్న వైమానిక విమానం

Last Updated : Mar 3, 2022, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.