ETV Bharat / international

బ్రిటన్​ మహారాణి ఎలిజబెత్​కు కరోనా

Queen Elizabeth Tested Positive: బ్రిటన్​ మహారాణి ఎలిజబెత్​-II కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు బకింగ్​హామ్​ ప్యాలెస్​ వెల్లడించింది.

Queen Elizabeth II tests positive
Queen Elizabeth II tests positive
author img

By

Published : Feb 20, 2022, 6:31 PM IST

Queen Elizabeth Tested Positive: బ్రిటన్​ రాణి ఎలిజబెత్​-II కరోనా బారినపడ్డారు. ఆమెకు తేలికపాటి జలుబు వంటి కొవిడ్​ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని బకింగ్​హామ్​ ప్యాలెస్​ ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం ఎలిజబెత్​.. విండ్​సర్​ క్యాజిల్​లోని తన నివాసంలోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాబోయే కొద్దిరోజుల పాటు విధులను పరిమితం చేసుకోనున్నట్లు పేర్కొన్నారు.

''బ్రిటన్​ రాణి వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ.. అన్ని కొవిడ్​ మార్గదర్శకాలను పాటిస్తారు.''

- బకింగ్​హామ్​ ప్యాలెస్​

ప్రస్తుతం ఇంగ్లాండ్​లో ఎవరైనా కరోనా బారినపడితే.. 10 రోజుల స్వీయ నిర్బంధం తప్పనిసరి. 6,7 రోజుల్లో రెండుసార్లు కరోనా నెగెటివ్​గా తేలితే క్వారంటైన్​ను ముందే వీడొచ్చు.

ఎలిజబెత్‌ కుమారుడు, వారసుడు ప్రిన్స్ చార్లెస్, ఆయన భార్య కెమిల్లా కూడా ఈ నెల ప్రారంభంలో కరోనా బారినపడ్డారు.

ఇవీ చూడండి: కిమ్ సాగు బాట.. భూమిని బాంబులతో పేల్చి శంకుస్థాపన!

ఫిరంగి దాడులు.. అణు విన్యాసాలు.. ఏ క్షణంలోనైనా యుద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.