ETV Bharat / international

'చర్చలకు రండి'.. హ్యారీకి ఎలిజబెత్​ రాణి ఆదేశం

రాజకుటుంబం నుంచి దూరంగా జీవించాలని ప్రకటించిన ప్రిన్స్​ హ్యారీని ముఖాముఖి చర్చకు రావాలని బ్రిటన్​ రాణి ఎలిజబెత్​-2 ఆదేశించారు. సోమవారం జరిగే ఈ భేటీలో హ్యారీతో పాటు ఆయన సోదరుడు డ్యూక్‌ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ విలియం, వారి తండ్రి.. వేల్స్‌ యువరాజు చార్లెస్‌ హాజరు కానున్నారు. మేఘన్​ మెర్కెల్​ ఫోన్​ ద్వారా చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది.

Queen calls crisis meeting with Harry, Meghan over royal couple's future
ప్రిన్స్​ హ్యారీ భవిష్యత్​పై బ్రిటన్​ రాణితో ముఖాముఖి
author img

By

Published : Jan 12, 2020, 5:42 PM IST

రాజకుటుంబం నుంచి వేరుపడతామంటూ ప్రకటించిన ప్రిన్స్ హ్యారీని... ముఖాముఖి చర్చలకు రావాలంటూ బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్‌-2 ఆదేశించారు. సోమవారం జరిగే ఈ సమావేశంలో.. డ్యూక్‌ ఆఫ్‌ ససెక్స్‌ ప్రిన్స్‌ హ్యారీ, ఆయన సోదరుడు డ్యూక్‌ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ విలియం, వారి తండ్రి.. వేల్స్‌ యువరాజు చార్లెస్‌ హాజరు కానున్నారు.

రాణి నివాసమైన శాండ్రింగ్‌హామ్‌లో జరిగే ఈ సమావేశంలో... ప్రిన్స్‌ హ్యారీ భార్య మేఘన్‌ మార్కెల్‌ ఫోన్‌ ద్వారా చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతం మేఘన్‌.. తన కుమారుడితో కెనడాలో ఉన్నారు. రాచకుటుంబం నుంచి బయటకువస్తున్నట్లు ప్రిన్స్‌ హ్యరీ దంపతులు ప్రకటించిన తర్వాత జరిగే మొదటి సమావేశం ఇది. కొన్ని రోజుల నుంచి సంప్రదింపులు జరుపుతున్న ప్రస్తుత సమావేశంతో ఈ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

రాజకుటుంబ సీనియర్ సభ్యుల బాధ్యతల నుంచి వైదొలిగి, బ్రిటన్, ఉత్తర అమెరికాల్లో ఉంటూ, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలన్న వారి కోరికకు ఈ సమావేశంలో పరిష్కారం చూపదని ఆంతరంగికుల సమాచారం.

నటీగా రీ ఎంట్రీ...

ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటామని ప్రకటించిన బ్రిటన్ రాజకుమారుడు డ్యూక్​ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య డచెస్ ఆఫ్ ససెక్స్​ మేఘన్​ మెర్కెల్​ అప్పుడే తమ ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. పెళ్లికి ముందు వదిలేసిన నటన వృత్తిని తిరిగి చేపట్టేందుకు మేఘన్ డిస్నీ లండన్​తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.