బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఫిలిప్‌కు నివాళులర్పిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శనివారం గన్ సెల్యూట్‌తో గౌరవ వందనం చేశారు. ఆయన అంత్యక్రియలు ఏప్రిల్ 17న నిర్వహించనున్నట్లు లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కొంది. ప్రిన్స్ కుటుంబీకులు 30 మంది మాత్రమే అంతిమ సంస్కారాలకు హాజరుకానున్నట్లు స్పష్టం చేసింది.
బ్రిటన్ కాలమానం ప్రకారం ఏప్రిల్ 17 మధ్యాహ్నం 3 గంటలకు.. ఒక నిమిషం జాతీయ మౌనం అనంతరం ప్రిన్స్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని క్వీన్ రాజనివాసంలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఇదీ చదవండి:ఇండోనేసియాలో భూకంపం- 8 మంది మృతి